అక్షరటుడే, వెబ్‌డెస్క్:Krishna River | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. మరోవైపు గోదావరి(Godavari) క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు లేకపోవడంతో ఆ నది వెలవెలబోతోంది.
కర్ణాటకలో భారీ వర్షాలు(Heavy Rains) పడుతున్నాయి. దీంతో తుంగభద్ర నది పొంగి ప్రవహిస్తోంది. అల్మట్టి(Almatty), తుంగభద్ర(Tungabhadra) నదులకు ఇన్‌ఫ్లో భారీగా నమోదు అవుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్ట్(Jurala Project)కు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే జూరాల నిండుకుండలా మారింది. మరోవైపు పలుగేట్ల రోప్‌లు తెగిపోయాయి. దీంతో అధికారులు వచ్చిన వరదను వచ్చినంటే దిగువకు వదులుతున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Krishna River | శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
జూరాల ప్రాజెక్ట్ నుంచి విడుదల చేసిన నీరు శ్రీశైలం(Srisailam) జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు 1,00,085 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 160.5282 టీఎంసీల నీరు ఉంది.
Krishna River | గోదావరికి వరద కరువు
గోదావరి నది(Godavari River)కి వరద రావడం లేదు. దీంతో ఆ నదిపై నిర్మించిన ప్రాజెక్ట్‌లు వెలవెలబోతున్నాయి. గోదావరిపై రాష్ట్రంలో శ్రీరామ్‌సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీరామ్‌సాగర్(Sriram Sagar) నుంచి మిడ్‌మానేరు, లోయర్ మానేర్ డ్యాంలకు వరద కాలువ ద్వరా నీటిని తరలించొచ్చు. అయితే ప్రస్తుతం వరద లేకపోవడంతో ఆయా ప్రాజెక్ట్‌లు వెలవెలబోతున్నాయి. అలాగే మంజీరాపై గల సింగూర్, నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లకు కూడా ఇన్‌ఫ్లో రావడం లేదు.