అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | ప్రపంచవ్యాప్తంగా గంధపు చెక్కలకు(Sandalwood) ఎంతో డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో కొందరు అక్రమార్కులు గంధపు చెట్లను నరికి స్మగ్లింగ్(Smuggling) చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో (Seshachalam Forest) భారీగా గంధపు చెట్లు ఉంటాయి.
దీంతో కొందరు అక్రమార్కులు వాటిని నరికి వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. తాజాగా అక్రమంగా తరలిస్తున్న గంధపు చెక్కలను హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) స్వాధీనం చేసుకున్నారు. గంధపు చెక్కల లోడ్‌తో వెళ్తున్న డీసీఎంను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు చేవెళ్ల(Chevella)లో పట్టుకున్నారు. డీసీఎంలో 10 టన్నుల గంధపు దుంగలు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.