More
    HomeతెలంగాణTelangana government | తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారా.. తెలంగాణ సర్కారు నజర్​.. వేతనంలో కోతపై పరిశీలన

    Telangana government | తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారా.. తెలంగాణ సర్కారు నజర్​.. వేతనంలో కోతపై పరిశీలన

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad | తమ చిన్న చిన్న సంతోషాలను త్యాగం చేసి.. తమ జీవితాలనే అర్పించి పెంచి, పెద్దచేసి, వారికో ప్రపంచం ఇచ్చిన తల్లిదండ్రులను (Parents) వారి జీవిత చరమాంకంలో నిర్లక్ష్యంగా వదిలేస్తున్న పిల్లలు ఎంతో మంది నేటి సమాజంలో ఉండడం దురదృష్టకరం.

    తమ రక్త మాంసాలను పిల్లలకు ధార పోసి.. మలి వయసులో నిర్లక్ష్యానికి గురై అచేతనులైన తల్లిదండ్రులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణలోని రేవంత్​ రెడ్డి సర్కార్​ (Revanth Reddy government) యోచిస్తోంది. నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్ధ తల్లిదండ్రుల కష్టాలను చూసిన సీఎం రేవంత్​రెడ్డి వారికి అండగా నిలిచేందుకు అడుగులు వేస్తున్నారు.

    Telangana government | వేతనాల నుంచి కోత..

    తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగస్తులైన పిల్లలపై సీఎం రేవంత్​ (CM Revanth Reddy) దృష్టి సారించారు. ఇలాంటి వారి జీతాల నుంచి 10–15% జీతాన్ని నేరుగా నుంచి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో (Bank account) జమ అయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు.

    READ ALSO  ACB Case | ఐఏఎస్‌ అధికారికి ఏసీబీ నోటీసులు.. ఎందుకో తెలుసా..!

    తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగస్తుల పిల్లల సాలరీ నుంచి కోత పెట్టి, ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసే విధానాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి ఉద్యోగుల జీతాలలో 10–15% నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు జమ చేయవచ్చో లేదో పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై నివేదికను సమర్పించాలని అధికారులను కోరారు.

    Telangana government | ట్రాన్స్‌జెండర్లపైనా..

    హైదరాబాద్​లోని (Hyderabad) ట్రాన్స్‌జెండర్లపైనా (transgenders) సీఎం రేవంత్​ రెడ్డి దృష్టి సారించారు. వారికి ఉపాధి కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వారిని ట్రాఫిక్ పోలీసు డిపార్ట్ మెంట్​లోకి (traffic police department) తీసుకున్నారు. దీంతోపాటు రవాణా, ఆరోగ్యం, ఎండోమెంట్స్, ఐటీ, ప్రైవేట్ కంపెనీలలో కూడా ట్రాన్స్‌జెండర్లను విస్తృతంగా చేర్చాలని అధికారులకు సీఎం సూచించారు.

    READ ALSO  Pashamilaram | పాశ‌మైలారం ఘటన మృతుల కుటుంబాలకు రూ.కోటి ప‌రిహారం..: సీఎం రేవంత్‌

    Latest articles

    Runamafi | చేనేత కార్మికులకు గుడ్​న్యూస్​.. రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Runamafi | రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు (handloom workers) గుడ్​ న్యూస్​ చెప్పింది. నేతన్నల...

    Nizamabad CP | క్రీడలు జీవితాన్నే మార్చేస్తాయి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | క్రీడలు మనిషి జీవితాన్ని మార్చేస్తాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య...

    ACB Raid | ఏసీబీ వలలో మరో ఉద్యోగి.. లంచం తీసుకుంటూ చిక్కిన తహశీల్దార్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగళం చిక్కింది. లంచం పేరిట...

    Petrol price | ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్.. పెట్రోల్ ధర రూ.266, డీజిల్ రేట్ రూ.272

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Petrol price | భారత్(India)తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుంది. అధిక...

    More like this