More
    Homeబిజినెస్​Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో యూఎస్‌ మార్కెట్లు పాజిటివ్‌గా ముగియగా.. యూరోప్‌ మార్కెట్లు నష్టపోయాయి. మంగళవారం ఉదయం నిక్కీ(Nikkei) మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలతోపాటు వడ్డీ రేట్ల కోతపై ఆశతో వాల్‌స్ట్రీట్‌(Wall street) ర్యాలీ తీసింది. ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ ఆల్‌టైం హై వద్ద కొనసాగుతున్నాయి. సోమవారం ఎస్‌అండ్‌పీ 0.52 శాతం, నాస్‌డాక్‌ 0.47 శాతం లాభాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.13 శాతం లాభంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    యూరొపియన్‌ మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్‌ సెషన్‌(Trading session)ను ముగించింది. డీఏఎక్స్‌ 0.52 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.43 శాతం, సీఏసీ 0.33 శాతం నష్టపోయాయి.

    READ ALSO  Today Gold Price | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధ‌ర ఎంతంటే..!

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.85 శాతం, కోస్పీ 1.73 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.64 శాతం, షాంఘై 0.14 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. నిక్కీ ఒక శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.14 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 831 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐలు నికరంగా రూ. 3,497 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.25 నుంచి 0.81కి తగ్గింది. విక్స్‌(VIX) 3.21 శాతం పెరిగి 12.79 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 66.37 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 25 పైసలు తగ్గి 85.74 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.21 శాతం తగ్గి 4.22 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 0.08 శాతం తగ్గి 96.79 వద్ద కొనసాగుతున్నాయి.
    • భారత దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచిక మేలో 1.2 శాతం పెరిగింది.
    READ ALSO  Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    యూఎస్‌, భారత్‌(Bharath)ల మధ్య ట్రేడ్‌ డీల్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన తర్వాత వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ లివిట్‌ స్పందించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

    Latest articles

    BJP National President | బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా భూపెందర్ యాదవ్..? రేసులో అందరి కన్నా ముందున్న కేంద్ర మంత్రి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: BJP National President | బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఆసక్తితో పాటు ఉత్కంఠ నెలకొంది....

    Kerala | ట్రాలీ బ్యాగుల్లో గంజాయి తరలింపు.. ఇద్దరు మహిళల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala | దేశవ్యాప్తంగా గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాలే...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. నిత్యం ఏసీబీ...

    Andhra Pradesh | ఏపీలో జులై 10న మెగా పేరెంట్ టీచ‌ర్ మీటింగ్.. ఆదేశాలు జారీ చేసిన అధికారులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యా విభాగం (State Education Department) ఆధ్వర్యంలో జూలై...

    More like this

    BJP National President | బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా భూపెందర్ యాదవ్..? రేసులో అందరి కన్నా ముందున్న కేంద్ర మంత్రి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: BJP National President | బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఆసక్తితో పాటు ఉత్కంఠ నెలకొంది....

    Kerala | ట్రాలీ బ్యాగుల్లో గంజాయి తరలింపు.. ఇద్దరు మహిళల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala | దేశవ్యాప్తంగా గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాలే...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. నిత్యం ఏసీబీ...