More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | కారు రైల్వే ట్రాక్​పైకి చేరుకోగానే పడిన గేటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

    Kamareddy | కారు రైల్వే ట్రాక్​పైకి చేరుకోగానే పడిన గేటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | రైల్వే గేటు (Railway Gate) వద్ద ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. రైలు వచ్చే సమయంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రించడానికి గేటు వేస్తారు. అయితే కొందరు వాహనదారులు గేటు పడేలోపు వెళ్దామని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో గేటు పడిపోవడంతో ట్రాక్​పై చిక్కుకుపోతారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా కామారెడ్డి (Kamareddy)లో ఓ కారు రైల్వే ట్రాక్​ మధ్యలో ఉండగా గేటు పడిపోయింది.

    Kamareddy | సిగ్నల్​ వ్యవస్థ మారడంతో..

    గతంలో గేట్​మన్​ చేతితో తిప్పుతూ రైల్వే గేటు వేసేవారు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రానిక్​ సిగ్నలింగ్​ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దీంతో బటన్​ నొక్కగానే గేట్లు పడిపోతాయి. తర్వాత రైలు వెళ్లాక కానీ వాటిని ఎత్తే అవకాశం లేదు. రైలు గేట్​ను దాటిన తర్వాత సిగ్నల్​ వస్తుంది. అది వచ్చాకే గేట్లు ఓపెన్​ అవుతాయి. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేటు (Ashok Nagar Railway Gate) వద్ద సోమవారం ఓ కారు రైల్వేట్రాక్​ మధ్యలోకి చేరుకోగానే గేట్లు పడిపోయాయి.

    READ ALSO  kamareddy collector | మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన ర్యాలీ

    గేట్​మన్​ కూడా వాటిని ఎత్తే అవకాశం లేకపోవడంతో కారులో ఉన్న వ్యక్తితో పాటు అక్కడ ఉన్న వారు ఆందోళన చెందారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో నిజామాబాద్ (Nizamabad) నుంచి వస్తున్న ముంబై ఎక్స్​ప్రెస్ రైలును అత్యవసరంగా ఆపేశారు. అనంతరం గేట్లు ఓపెన్ చేసి కారును ట్రాక్ పైనుంచి పంపించారు. దీంతో కారులో ఉన్న వ్యక్తితో పాటు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పింది.

    Latest articles

    Agni-5 | అత్యాధునిక బంకర్​ బస్టర్​పై డీఆర్​డీఓ కసరత్తు.. అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి కొత్త వేరియంట్‌ అభివృద్ధి!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 : భారత సైనిక సామర్థ్యాలకు గణనీయమైన ముందడుగు పడుతోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ...

    Vizag Glass Bridge | విశాఖకు స‌రికొత్త ఆకర్షణ.. కైలాసగిరిలో భారతదేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vizag Glass Bridge | ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పర్యాటక రంగం అభివృద్ధికి కూట‌మి ప్రభుత్వం అనేక...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 1 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – మంగళవారంమాసం – ఆషాఢపక్షం...

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని...

    More like this