అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cricketer : గుండెపోటు(Heart attack) ఎవరికి ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆటగాళ్లు కూడా హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు. ఇటీవల మేడ్చల్(Medchal)లో ఓ యువకుడు హార్ట్ ఎటాక్‌తో గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. తాజాగా పంజాబ్‌లోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
పంజాబ్(Punjab)లో క్రికెట్ ఆడుతూ యువ క్రికెటర్ హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిపోయాడు. ఫిరోజ్ పూర్ జిల్లా(Ferozepur district)లో జరిగిన ఓ లోకల్ క్రికెట్ మ్యాచ్‌లో ఈ విషాద ఘటన నెలకొంది. ఆ బ్యాటర్‌ను ఫిరోజ్ పూర్‌కు చెందిన హర్జీత్ సింగ్ గుర్తించారు.
Cricketer : బాల్‌ను బౌండరీ దాటించి..
మైదానంలో హర్జీత్ సింగ్ Harjeet Singh బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలర్ వేసిన బంతిని (సిక్స్) బౌండరీ దాటించి, పిచ్‌లో ముందుకు నడుచుకుంటూ వెళ్లి పడిపోయాడు. అలసటతో కూలబడి అలానే కిందపడిపోయాడు. తోటి ఆటగాళ్లు అతనికి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది.
Cricketer : ఇటీవల బంగ్లా క్రికెటర్..
యువ క్రికెట్ గుండెపోటుతో మరణించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో క్రికెటర్లు హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన స్టార్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ Bangladeshi star batsman Tamim Iqbal కూడా ఇటీవల మైదానంలోనే కుప్పకూలిపోయాడు. సకాలంలో చికిత్స అందించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.