అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) కాసేపు లెక్కల మాస్టారుగా మారారు. శనివారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను (ZP High School Chinnamalla Reddy) సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కాసేపు విద్యార్థులకు లెక్కల పాఠాలు బోధించారు.
Kamareddy Collector | సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
అలాగే, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు సైతం వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధిస్తే వారు వారి తల్లిదండ్రులకు పరిసరాల పరిశుభ్రతపై వివరిస్తారని పేర్కొన్నారు.