More
    HomeజాతీయంIPS officer Parag Jain | రా చీఫ్ గా పరాగ్ జైన్.. నిఘాను బలోపేతం...

    IPS officer Parag Jain | రా చీఫ్ గా పరాగ్ జైన్.. నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPS officer Parag Jain | భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ ఏ డబ్ల్యూ-రా) అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ (IPS officer Parag Jain) నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత రా చీఫ్ రవి సిన్హా(RAW Chief Ravi Sinha) పదవీ కాలం జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం జైన్​ను నియమించింది. ప్రస్తుతం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ఏఆర్సీ) అధిపతిగా పని చేస్తున్న జైన్.. భారత దేశం వెలుపల నిఘా సామర్థ్యాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్తాన్ సైనిక కదలికలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిఘా సేకరణతో పాటు ఆయన నాయకత్వంలోని ఏఆర్సీ ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) సమయంలో కీలక పాత్ర పోషించింది.

    READ ALSO  South Central Railway | రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో మెమో ట్రైన్స్

    IPS officer Parag Jain | పరాగ్ జైన్ ఎవరు?

    పంజాబ్ కేడర్​కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన జైన్.. క్షేత్ర అనుభవం, వ్యూహాత్మక నిఘా పనిలో అసాధారణమైన ప్రతిభ చాటుకున్నారు. ప్రస్తుతం రా లో రెండో అత్యంత సీనియర్ అధికారిగా పని చేస్తున్న జైన్ నేరుగా చీఫ్​కు నివేదిస్తాడు. బహుళ ఉన్నత స్థాయి కార్యాచరణ, నిఘా విభాగాల పర్యవేక్షణను సమర్థవంతంగా నిర్వహించారు. రా విభాగంలో 15 సంవత్సరాలకు పైగా అంకితభావంతో సేవలందించిన ఆయన.. ఉగ్రవాద నిరోధక నిర్మాణంలో కీలక వ్యక్తిగా ఎదిగారు.

    IPS officer Parag Jain | అనుభవజ్ఞుడైన అధికారి..

    అనేక సున్నితమైన, కీలకమైన రంగాలకు జైన్ నైపుణ్యం విస్తరించింది. ఉగ్రవాద నిర్మూలనతో పాటు పంజాబ్ అంతర్గత భద్రత నుంచి ఖలిస్తాన్-సంబంధిత కదలికలు, సరిహద్దు డయాస్పోరా నెట్వర్క్​ల (Diaspora networks) నిఘా వరకు.. అన్నింట్లోనూ ఆయన పాత్ర ఉంది. భటిండా, మాన్సా, హోషియార్పూర్​లలో పని చేశారు. చండీగఢ్ SSP, లూథియానా DIGగా కీలక సమయాల్లో వ్యవహరించారు. బాహ్య నిఘా విభాగంలో జైన్ పాకిస్తాన్ డెస్క్ (Pakistan Desk) ను నిర్వహించారు. భారతదేశ చరిత్రలో రెండు కీలకమైన అధ్యాయాలైన ఆర్టికల్ 370 రద్దు, ఆపరేషన్ బాలాకోట్ సమయంలో ఆయన వ్యూహాత్మక చర్యలు జమ్మూకశ్మీర్​ను ప్రశాంతంగా ఉండేలా చేశాయి. అంతర్జాతీయ స్థాయిలోనూ జైన్ ప్రతిభ సాధారణమైనది కాదు. కెనడాలోని ఒట్టావాలో, డయాస్పోరా డైనమిక్స్​పై నిఘా ఉంచుతూ, రాడికల్ సిక్కు వేర్పాటువాద నెట్వర్క్​లను ట్రాక్ చేయడంలో, చొరబడడంలో జైన్ కీలక పాత్ర పోషించారు. భారతదేశానికి సరిహద్దు, ప్రపంచ సవాళ్లు పెరుగుతున్న సమయంలో దేశీయంగా, అంతర్జాతీయంగా అతని విస్తృతమైన క్షేత్ర స్థాయి అనుభవం అతన్ని విశ్వసనీయ నిఘా విభాగానికి చీఫ్​ను చేసింది.

    READ ALSO  CM Convoy | సీఎం కాన్వాయ్​ కార్లలో డీజిల్​కు బదులు నీళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..

    Latest articles

    ENG-W vs IND-W | స్మృతి మంధాన అద్భుత సెంచరీ.. మహిళల T20I లో సెంచరీ సాధించిన రెండో భారతీయురాలిగా రికార్డు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ENG-W vs IND-W : నాటింగ్‌హామ్‌లో శనివారం(జూన్ 28) జరిగిన మహిళల ఇంగ్లండ్​(England) వర్సెస్​ టీమిండియా(Team...

    Russia | శిక్షణ విమానం కూలిపోయి నలుగురి దుర్మరణం.. మాస్కో సమీపంలో ఘటన

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Russia : మాస్కో(Moscow) ప్రాంతంలోని కొలోమ్నా జిల్లాలో శనివారం (జూన్ 28) తేలికపాటి శిక్షణ విమానం...

    Diabetes | షుగర్​ పేషెంట్స్ కు గుడ్​న్యూస్​.. రూ. 15కే డయాబెటిస్ పరీక్ష

    అక్షరటుడే, హైదరాబాద్: Diabetes : హైదరాబాద్​(Hyderabad)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ క్యాంపస్(Birla...

    Uttar Pradesh | మ‌హిళ‌తో కలిసి బైక్​పై రిస్కీ స్టంట్స్.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఇటీవ‌లి కాలంలో రోజురోజుకూ బరితెగించేస్తున్నారు. సమాజమే సిగ్గుతో తలదించుకునేలా వారు చేస్తున్న...

    More like this