అక్షరటుడే, వెబ్‌డెస్క్: Police transfers | తెలంగాణ రాష్ట్రంలో ఏసీపీలు, డీఎస్పీలు బదిలీ (ACPs and DSPs transfers) అయ్యారు. మొత్తం 44 మంది డీఎస్పీలను ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే హైదరాబాద్ (Hyderabad) జంటనగరాల్లో భారీగా ఏసీపీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వై.నాగేశ్వర రావు (ఏసీపీ సీసీఎస్ సైబరాబాద్), సంపత్‌కుమార్ (ఏసీపీ కమాండ్ కంట్రోల్ రాచకొండ), ఆకుల చంద్రశేఖర్ (ట్రాఫిక్ ఏసీపీ మహేశ్వరం)కు బదిలీ అయ్యారు.
కాగా.. రాష్ట్రంలో ఇటీవల పలువురు డీఎస్పీలు బదిలీ(DSP Transfers) అయ్యారు. 12 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగిస్తూ డీజీపీ జితేందర్(DGP Jitender) ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా మల్టీ జోన్ –1 పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా సుమారు 20 రోజుల క్రితం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా పోలీసులను బదిలీ చేశారు. పది మంది ఇన్స్పెక్టర్లతో పాటు 249 మంది సబ్ ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేశారు.