More
    Homeఅంతర్జాతీయంJeff Bezos | 61 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న అమెజాన్​ వ్యవస్థాపకుడు జెఫ్​బెజోస్

    Jeff Bezos | 61 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న అమెజాన్​ వ్యవస్థాపకుడు జెఫ్​బెజోస్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jeff Bezos | ప్రపంచ కుబేరుడు, అమెజాన్​ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ 61 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు లారెన్‌ శాంచెజ్‌ (Lauren Sanchez)ను బెజోస్​ శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుక ఇటలీలోని వెనిస్‌లో గల ఓ ఐలాండ్‌లో శుక్రవారం అట్టాహాసంగా జరిగింది.

    జెఫ్​ బెజోస్(Jeff Bezos)​ గతంలోనే పెళ్లి అయింది. అయితే 2018లో ఆయన లారెన్​తో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఆమెతో డేటింగ్​ చేశారు. 2019లో ఈ విషయం బయటకు వచ్చింది. అదే సంవత్సరం ఆయన తన భార్య మెకంజీ స్కాట్‌కు విడాకులు ఇచ్చారు. కాగా మెకంజీతో ఆయనకు నలుగురు పిల్లలున్నారు. ఆమె బంధాన్ని తెంచుకున్న బెజోస్​ లారెన్​తో ప్రేమాయణాన్ని కొనసాగించారు. వీరి వివాహంపై గతంలో అనేక వార్తలు వచ్చాయి. అయితే శుక్రవారం వీరిద్దరూ ఒకటయ్యారు.

    READ ALSO  Trump warn | ఇరాన్​కు ట్రంప్​ మరో స్ట్రాంగ్​ వార్నింగ్​.. ఏమన్నారంటే..

    తమ వివాహ ఫొటోలను లారెన్‌ (55) తన ఇన్‌స్టా ఖాతాలో షేర్​ చేశారు. అంతేగాకుండా తన ఇనస్టా పేజీ పేరును లారెన్‌ శాంచెజ్‌ బెజోస్‌గా ఆమె మార్చుకున్నారు. కాగా.. అమెజాన్​ వ్యవస్థాపకుడి పెళ్లి వేడుక కావడంతో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా(Trump daughter Ivanka), ఆమె భర్త జారెడ్‌ కుష్నెర్‌, కిమ్‌ కర్దాషియన్‌, కోలే కర్దాషియన్‌, ప్రముఖ జర్నలిస్ట్‌ ఓప్రా విన్‌ఫ్రే(Famous journalist Oprah Winfrey), జోర్డాన్‌ రాణి రనియా తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 200 మంది ప్రముఖులు పెళ్లికి హాజరైనట్లు సమాచారం.

    Latest articles

    Vice President Dhankhar | ప్ర‌వేశిక‌ను మార్చ‌లేము కానీ..1976లోనే మార్చార‌ని గుర్తు చేసిన ధ‌న్‌ఖ‌డ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vice President Dhankhar | రాజ్యాంగ ప్ర‌వేశిక మార్పుపై వివాదం నెల‌కొన్న త‌రుణంలో ఉప రాష్ట్ర‌ప‌తి...

    IAS Officers | రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు అదనపు బాధ్యతలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IAS Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్​ అధికారులు అదనపు...

    Gandhari | గాంధారిలో ఎలుగుబంటి కలకలం

    అక్షరటుడే గాంధారి: Gandhari | గాంధారి మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని...

    Vehicle Number Plates | ఆ వాహ‌నాల‌కు కొత్త నంబ‌ర్ ప్లేట్లు.. కేంద్ర మంత్రిత్వ శాఖ ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vehicle Number Plates | హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాల కోసం కొత్త త‌ర‌హా నెంబ‌ర్...

    More like this