అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక, అక్రమ రవాణాకు గురైన చిన్నారులను రక్షించడానికి ఆపరేషన్ ముస్కాన్ (Operation Muskaan ) చేపడుతున్నట్లు తెలిపారు.
జులై ఒకటి నుంచి నెల రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించనున్నారు. తప్పిపోయిన పిల్లలు, అనాథలు, అక్రమ రవాణా చేయబడుతున్న పిల్లలను గుర్తించి పునరావాసం కల్పించడమే లక్ష్యంగా ఆపరేషన్ ముస్కాన్ చేపట్టున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 706 పోలీస్ సిబ్బంది, 121 సబ్ డివిజనల్ పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్ను అడిషనల్ డీజీపీ చారు సిన్హా (Additional DGP Charu Sinha) విడుదల చేశారు.
Operation Muskaan | ఏటా కొనసాగుతున్న కార్యక్రమం
తప్పిపోయిన పిల్లలను కనుగొని తిరిగి వారి కుటుంబాలకు చేర్చడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత పదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని అధికారులు చేపడుతున్నారు. ఏటా జులైలో ఆపరేషన్ ముస్కాన్ చేపడతారు. ఈ సారి 11 విడత ఆపరేషన్ చేపట్టడానికి అధికారులు సిద్ధం అయ్యారు. తప్పిపోయిన, అక్రమ రవాణాకు గురైన చిన్నారులను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అలాగే బాలకార్మికులకు విముక్తి కల్పించడానికి చర్యలు చేపట్టనున్నారు.