More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కలియుగ దైవం వేంకటేశ్వరుడి(Lord Venkateswara) దర్శనం చేసుకొని తరిస్తుంటారు. ప్రస్తుతం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు(Devotees) వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

    తిరుమల శ్రీవారిని బుధవారం 64,879 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,960 మంది తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీకి హుండీ ద్వారా 4.09 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ(TTD) ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది.

    భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఇటీవల లడ్డూ ప్రసాదం టోకెన్ల కోసం కియోస్క్​ మిషన్లు(Kiosk Machines) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్​లో వేచి ఉన్న భక్తులు.. మళ్లీ లడ్డూ ప్రసాదం టోకెన్ల కోసం బారులు తీరడానికి ఇబ్బందులు పడేవారు. దీంతో వారి సమయాన్ని ఆదా చేయడం కోసం టీటీడీ ఐదు కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేసింది. ఆధార్​కార్డు, దర్శనం టోకెన్​ నంబర్​ ఎంటర్​ చేసి.. యూపీఐ ద్వారా అమౌంట్​ పే చేస్తే ఈ మిషన్ల నుంచి లడ్డూ ప్రసాదం టోకెన్లు వస్తాయి. వాటిని తీసుకెళ్లి ప్రసాదం కౌంటర్లలో ఇచ్చి లడ్డూలు తీసుకోవచ్చు. అంతేగాకుండా తిరుమల భక్తుల కోసం టీటీడీ ఇటీవల ఉచిత ఆర్టీసీ బస్సు(Free RTC Bus) ప్రయాణ సౌకర్యాన్ని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.

    READ ALSO  YS Jagan | జగన్​ కారు కింద పడడంతోనే సింగయ్య మృతి.. వీడియో వైరల్​

    Latest articles

    High Court | ప్రభుత్వానికి హైకోర్టు షాక్​.. రూ.350 కోట్ల భూ కేటాయింపులు రద్దు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)​లో అంతర్జాతీయ...

    NIT Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. వరంగల్‌ ఎన్ఐటీలో జాబ్స్.. జీతం ఎంతో తెలుసా..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: NIT Jobs | దేశంలో ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థలలో ఒకటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...

    PJR Flyover | నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PJR Flyover | గచ్చిబౌలి నుంచి కొండాపూర్​ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్​ (Kondapur Flyover)...

    Jagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | హరే కృష్ణ.. హరే రామ.. కృష్ణ కృష్ణ హరే హరే......

    More like this