అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Brands : భారతీయ విస్కీ బ్రాండ్లు ప్రపంచ మార్కెట్లను శాసిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా విక్రయిస్తున్న విస్కీ బ్రాండ్లలో మన దేశానికి చెందిన ఎనిమిది బ్రాండ్లు టాప్-20 ప్లేస్‌లో నిలిచాయి. అందులో మెక్ డొవెల్స్ McDowells నంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించగా, రాయల్ స్టాగ్ Royal Stag, ఆఫీసర్స్ చాయిస్ Officer’s Choice వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వాస్తవానికి విస్కీ ప్రియులను ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్ల గురించి అడిగితే.. జానీ వాకర్ Johnnie Walker, జాక్ డేనియల్స్ Jack Daniels, జేమ్సన్ Jameson వంటి పేర్లు చెబుతారు. కానీ రియాల్టీ ఏమిటంటే ప్రపంచ మార్కెట్‌లో భారతీయ విస్కీ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 20 బ్రాండ్‌లలో ఎనిమిది మన దేశానికే కావడం విశేషం.
Indian Brands : వృద్ధి చెందుతోన్న విస్కీ మార్కెట్..
భారతదేశంలోని అపారమైన జనాభా, ప్రీమియం స్పిరిట్ల పట్ల పెరుగుతున్న ఆసక్తితో విస్కీ మార్కెట్ విపరీతంగా వృద్ధి చెందింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాల్లో మెక్‌డోవెల్స్ నంబర్ 1, రాయల్ స్టాగ్, ఆఫీసర్స్ ఛాయిస్ వంటి బ్రాండ్లను అగ్రస్థానానికి చేర్చింది. ప్రపంచ వ్యాప్తంగా విస్కీ పరిశ్రమ విలువ సుమారు 1.8 ట్రిలియన్ డాలర్లు కాగా, ఇది 2030 నాటికి సాలీనా 9.7% శాతం చొప్పునపెరుగుతుందని అంచనా. సరసమైన, ప్రీమియం విస్కీలకు పెరుగుతున్న డిమాండ్ కు ఇండియా, చైనా కీలకంగా మారాయి.
Indian Brands : అత్యధిక వినియోగం ఇండియాలోనే..
విస్కీ విక్రయాల్లో ఇండియానే నెంబర్ వన్‌గా నిలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ వినియోగదారు ఇండియాగా పేరొందింది. ప్రపంచ విస్కీ వినియోగంలో దాదాపు సగం వాటా కలిగి ఉంది. ఈ అధిక డిమాండ్ భారతీయ విస్కీ బ్రాండ్ల భారీ అమ్మకాలకు దారి తీసింది. ఇండియాలో ఏటా బిలియన్ల లీటర్ల విస్కీని మద్యం ప్రియులు లాగించేస్తున్నారు. ఇండియాలో అత్యధికంగా జరుగుతున్న విస్కీ విక్రయాల్లో మెక్‌డోవెల్స్ విస్కీ 31.4 మిలియన్ లీటర్లు, రాయల్ స్టాగ్ 27.9 మిలియన్లు, ఆఫీసర్స్ ఛాయిస్ 23.4 మిలియన్లు, ఇంపీరియల్ బ్లూ 22.8 మిలియన్ లీటర్ల విస్కీ అమ్ముడు పోతోంది. ప్రపంచంలో జరిగే టాప్-5 బ్రాండ్ల విక్రయాల్లో నాలుగు ఇండియా నుంచే ఉండడం విశేషం.
Indian Brands : విదేశీ విస్కీ కూడా..
ఇక, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 విస్కీ బ్రాండ్లలో విదేశీ బ్రాండ్లు కూడా ఉన్నాయి. స్కాట్లాండ్‌కు చెందిన జానీ వాకర్ 22.3 మిలియన్ లీటర్లు, అమెరికాకు చెందిన జిమ్ బీమ్ 17 మిలియన్లు, జపాన్‌కు చెందిన సుంటోరీ కాకుబిన్ 15.8 మిలియన్లు, అమెరికాకు చెందిన జాక్ డేనియల్స్ 14.3 మిలియన్లు, ఇండియాకు చెందిన 8 పీఎం 12.2 మిలియన్లు, ఐర్లాండ్‌కు చెందిన జేమ్సన్ 10.2 మిలియన్ లీటర్ల చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. వీటిలో సరసమైన వాటితో పాటు ప్రీమియం బ్రాండ్లు కూడా ఉండడం విశేషం.