More
    Homeబిజినెస్​Pre market analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre market analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre market analysis : గ్లోబల్‌ మార్కెట్(Global markets)లో పాజిటివ్‌ మూడ్‌ కొనసాగుతోంది. గురువారం యూఎస్‌(US), యూరోప్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం లాభాల బాటలోనే సాగుతున్నాయి.

    Pre market analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq) 0.97 శాతం, ఎస్‌అండ్‌పీ 0.80 శాతం పెరిగాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.22 శాతం లాభంతో కొనసాగుతోంది.

    Pre market analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    డీఏఎక్స్‌(DAX) 0.64 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.19 శాతం పెరగ్గా.. సీఏసీ 0.01 శాతం నష్టంతో ముగిసింది.

    Pre market analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల సమయంలో నిక్కీ(Nikkei) 1.55 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.51 శాతం, హంగ్‌సెంగ్‌ 0.27 శాతం, షాంఘై 0.23 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. కోస్పీ 0.39 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.05 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.46 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    READ ALSO  Today Gold Price | దిగి వ‌స్తున్న బంగారం, వెండి ధ‌ర‌లు.. నేడు ఎంత ఉన్నాయంటే..!

    Pre market analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు గత ట్రేడింగ్‌ సెషన్‌లో నెట్‌ బయ్యర్(Net buyers)లుగా నిలిచారు. వారు నికరంగా రూ. 12,594 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. డీఐఐలు నికరంగా రూ. 195 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.13 నుంచి 1.28కు పెరిగింది. విక్స్‌(VIX) మరో 2.87 శాతం తగ్గి 12.59 వద్ద ఉంది. పీసీఆర్‌ పెరగడం, విక్స్‌ తగ్గడం మార్కెట్‌లో బుల్స్‌కు అనుకూల వాతావరణాన్ని సూచిస్తున్నాయి.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.66 శాతం పెరిగి 68.16 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 39 పైసలు బలపడి 85.70 వద్ద ఉంది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 45 శాతం పెరిగి 4.26 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 0.14 శాతం తగ్గి 97.26 వద్ద కొనసాగుతున్నాయి.
    • మార్కెట్లలో బుల్లిష్‌ ట్రెండ్‌(Bullish trend) కొనసాగుతోంది. ఐదు వారాల కన్సాలిడేషన్‌ తర్వాత వచ్చిన బ్రేక్‌ అవుట్‌తో గత ట్రేడింగ్‌ సెషన్‌లో ప్రధాన సూచీలు తొమ్మిది నెలల గరిష్టానికి చేరాయి.
    READ ALSO  Stock Market | లార్జ్‌ క్యాప్‌లో ర్యాలీ.. లాభాల్లో ప్రధాన సూచీలు

    Latest articles

    Stock market | నాలుగో రోజూ లాభాల్లోనే.. ఆల్‌టైం హైలో బ్యాంక్‌ నిఫ్టీ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) ఆల్‌టైం హై దిశగా అడుగులు...

    Tenth Supplementary Results | టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tenth Supplementary Results | తెలంగాణ(Telangana)లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి....

    Karnataka | విష ప్ర‌యోగం.. ఏకంగా ఐదు పులులు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Karnataka | కర్ణాటక - కేరళ సరిహద్దులోని మలై మహదేవేశ్వర వన్యప్రాణి విభాగం (Malai Mahadeshwara...

    CDC Chairman | సీడీసీ ఛైర్మన్ రాజీనామా ఉపసంహరణ.. పార్టీ నేతల బుజ్జగింపులే కారణమా..!

    అక్షరటుడే, కామారెడ్డి: CDC Chairman | ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన సీడీసీ ఛైర్మన్ ఇర్షాదొద్దీన్ (CDC...

    More like this

    Stock market | నాలుగో రోజూ లాభాల్లోనే.. ఆల్‌టైం హైలో బ్యాంక్‌ నిఫ్టీ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) ఆల్‌టైం హై దిశగా అడుగులు...

    Tenth Supplementary Results | టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tenth Supplementary Results | తెలంగాణ(Telangana)లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి....

    Karnataka | విష ప్ర‌యోగం.. ఏకంగా ఐదు పులులు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Karnataka | కర్ణాటక - కేరళ సరిహద్దులోని మలై మహదేవేశ్వర వన్యప్రాణి విభాగం (Malai Mahadeshwara...