More
    Homeఅంతర్జాతీయంSwiss bank | భారీగా డబ్బు పోగేస్తున్న భారతీయులు.. స్విస్ బ్యాంకులోనే ఎందుకు దాస్తున్నారంటే..!

    Swiss bank | భారీగా డబ్బు పోగేస్తున్న భారతీయులు.. స్విస్ బ్యాంకులోనే ఎందుకు దాస్తున్నారంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swiss bank | నల్లధనం (black money) గురించి చర్చ వస్తే చాలు.. అందరికీ స్విస్ బ్యాంకే గుర్తొస్తుంది. విదేశీయులు ఎక్కువగా డబ్బు దాస్తున్న దేశం ఏదంటే స్విట్జర్లాండ్ (Switzerland) పేరే వినిపిస్తుంది. స్విస్ బ్యాంకుల్లో పోగేసిన డబ్బుల వివరాలు ఇటీవల బయటకు వచ్చాయి. స్విట్జర్లాండ్​తో భారతదేశానికి ఉన్న ఒప్పందం (India agreement) మేరకు ఆ దేశం తమ బ్యాంకుల్లో ఉన్న వివరాలను ఇండియాతో పంచుకుంది. 2024 నాటికి ఆ దేశ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న డబ్బు దాదాపు రూ.38 వేల కోట్లుగా లెక్క తేలింది. అంతేకాదు, ప్రపంచ దేశాలకు చెందిన వారు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో దాచిన సొమ్ము (hidden money) రూ. లక్షల కోట్లు దాటినట్లు చెబుతారు. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ దేశాల డబ్బుకు ఆ దేశం ఎందుకు కేంద్రంగా మారింది? స్విస్ బ్యాంకులు ఎందుకంతా పేరొందాయి? ఎందుకు ప్రపంచంలోని కుబేరులంతా అక్కడ డబ్బు దాచుకుంటున్నారు? వంటి విషయాలపైనే ఇప్పుడందరి దృష్టి నెలకొంది.

    READ ALSO  India - US | అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పీఠ‌ముడి

    Swiss bank | కోట్ల కొద్దీ డిపాజిట్లు..

    కుబేరులు, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రికెటర్లు, క్రీడాకారులు అందరూ స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడానికి వరుస కడుతున్నారు. ఇండియాలో వివిధ మార్గాల్లో సంపాదించిన సొమ్మును (saving money) అక్కడ దాచుకుంటున్నారు. ఇందులో కేవలం నల్లడబ్బు మాత్రమే కాదు, చట్టబద్ధంగా సంపాదించిన సొమ్ము కూడా ఉంటుంది. కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు చెందిన వారంతా స్విస్ బ్యాంకుల (Swiss banks) వైపు మొగ్గు చూపుతారు.

    Swiss bank | సురక్షితమనే విశ్వాసం

    అయితే, కుబేరులు, బడా బాబులు స్విట్జర్లాండ్​ను (Switzerland) ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అక్కడ తమ డబ్బు సురక్షితంగా ఉంటుందన్న నమ్మకమే వారిని ఆ దేశం వైపు మొగ్గు చూపేలా చేస్తోంది. స్విట్జర్లాండ్ ప్రభుత్వం (Swiss government) కూడా ఎవరితోనూ గిల్లికజ్జలు పెట్టుకోదు. ప్రపంచ యుద్ధ (world war) సమయంలోనూ ఆ దేశం పాలుపంచుకోలేదు. అందుకే ఆ దేశం ప్రశాంతంగా, సురక్షితంగా ఉంది. పైగా ప్రపంచంలో ఏం జరిగినా ఈ దేశం అందులో వేలు పెట్టదు. అన్ని దేశాలతో ఎంతో కొంత సత్సంబంధాలు ఉన్నప్పటికీ, ఏ దేశంతోనూ స్విట్జర్లాండ్​కు శతృత్వం లేదు.

    READ ALSO  B-2 Bombers | అమెరికా బీ-2 బాంబర్ల రూపకల్పనలో భారత సంతతి ఇంజినీర్ కీలక పాత్ర.. కానీ..!

    మిగతా దేశాల్లో నెలకొన్న అనిశ్చితి, ఇరుగు పొరుగు వారితో కయ్యాలు ఉండగా, ఈ దేశానికి మాత్రం ఎలాంటి ముప్పు లేదు. ఇక, స్విట్జర్లాండ్​కు ఉన్న ప్రత్యేకత ఏ దేశానికీ లేదు. ఎందుకంటే ఆ దేశం మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఉండడమే. ఆల్ఫ్ పర్వతాలు ఆ దేశాన్ని అద్భుతంగా రక్షిస్తున్నాయి. భూమ్మీద అతి సురక్షితమైన దేశంగా (safest country on earth) స్విట్జర్లాండ్​కు పేరు తెచ్చి పెట్టాయి. ఆ పర్వతాలను దాటి దాడి చేయడం మిగతా దేశాలకు దాదాపు అసాధ్యమనే చెబుతారు. అత్యంత భద్రంగా, సురక్షితంగా పేరొందిన స్విట్జర్లాండ్​లో డబ్బుదాచుకోవడానికి ప్రధాన కారణమిదే. దానికి తోడు పన్నులు, ఇతర ఛార్జీలు కూడా పెద్దగా ఉండక పోవడం, భద్రత ఎక్కువగా ఉండడంతో కుబేరులంతా స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తున్నారు.

    READ ALSO  Mohan Babu | మోహ‌న్ బాబుకు న్యూజిలాండ్‌లో 7వేల ఎక‌రాలు.. బ్ర‌హ్మాజీ చేసిన ప‌నికి..

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...