అక్షరటుడే, వెబ్‌డెస్క్:Muruga Book | పురాణ పురుషుల పాత్రలు పోషించేటప్పుడు నటీనటులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆ పాత్ర గుర్తించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. తమకు తెలియని విషయాలను పూర్తిగా తెలుసుకుంటే ఆ పాత్రలో అంతగా ఒదిగిపోవచ్చని వారి నమ్మకం. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ చేతిలో ‘మురుగ’ పుస్తకం(Muruga Book )తో దర్శనమివ్వడం చర్చనీయాంశం అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Director Prashant Neel)తో “డ్రాగన్” అనే ప్రాజెక్ట్‌ను చేయడంతో పాటు, బాలీవుడ్ సినిమా “వార్ 2” కూడా చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 14న విడుదలకు సిద్ధంగా ఉంది.
Muruga Book | సినిమా కోసమేనా?
ఈ సందర్భంలో, ముంబై నుండి హైదరాబాద్‌కు చక్కర్లు కొడుతున్నారు ఎన్టీఆర్(Jr.NTR). అయితే ముంబై ఎయిర్‌పోర్టు(Mumbai Airport)లో ఓ పుస్తకం పట్టుకుని నడుస్తున్న ఎన్టీఆర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పుస్తకం ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం రాసిన “మురుగ: ది లార్డ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విస్డమ్” (Muruga: The Lord of War, The God of Wisdom). తారక్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో చేయబోతున్న నేపథ్యంలో ఆ సినిమా కోసం ఇప్పటి నుండే కుమారస్వామి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టు అర్థమవుతోంది.
ఎన్టీఆర్-త్రివిక్రమ్(Trivikram) సినిమా మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని సమాచారం. అటువంటి నేపథ్యంలో, “మురుగ” కథపై ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. ఇటీవల ‘డ్రాగన్'(Dragon) కొంతభాగం షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ NTR .. ఆ చిత్రానికి స్మాల్ బ్రేక్ ఇచ్చి.. వార్-2 సాంగ్ షూట్ కోసం ముంబై వెళ్లారు. ఈ క్రమంలో ముంబై ఎయిర్ పోర్టులో జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఆనంద్ బాలసుబ్రమణియన్(Anand Balasubramanian) రాసిన ‘మురుగ’ పుస్తకం దర్శనమిచ్చింది. ఇంకేముంది త్రివిక్రమ్ సినిమా కోసమే ఎన్టీఆర్ ఈ బుక్ చదువుతున్నాడని ముచ్చటించుకుంటున్నారు.