More
    HomeజాతీయంEncounter | ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి

    Encounter | ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Encounter | ఛత్తీస్​గఢ్​(Chhattisgarh)లో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. నారాయణపూర్​ జిల్లా(Narayanpur district)లో పోలీసులు, మావోయిస్టల మధ్య గురువారం తెల్లవారుజామున ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు(Security forces) ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

    కేంద్ర హోం మంత్రి అమిత్​ షా(Union Home Minister Amit Shah) ఇటీవల మాట్లాడుతూ.. మావోయిస్టులకు నిద్ర లేకుండా చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి వానాకాలంలో వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని మావోలు రెస్ట్ తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వానాకాలంలో వారికి నిద్ర లేకుండా చేస్తామని ప్రకటించారు. 2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయుధాలు వీడి లొంగిపోవడం తప్ప మావోలకు మరో అవకాశం లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో బలగాలు నారాయణపూర్​ జిల్లాలో కూంబింగ్(Coombing)​ చేపడుతుండగా ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు మాహిళా మావోయిస్టులు మృతి చెందారు.

    READ ALSO  Jharkhand | భార్య‌ను చ‌దివించ‌డం కోసం లోన్ తీసుకున్న భ‌ర్త‌.. ఉద్యోగం రాగానే ల‌వ‌ర్‌తో భార్య‌ జంప్​

    Encounter | ఆపరేషన్​ కగార్​తో కకావికలం

    కేంద్ర ప్రభుత్వం(Central Government) చేపట్టిన ఆపరేషన్​ కగార్​తో మావోయిస్టులు కకావికలం అవుతున్నారు. వేల సంఖ్యలో బలగాలు అడువులను చుట్టు ముడుతుండడంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న అడవుల్లోకి సైతం బలగాలు చొచ్చుకువెళ్తున్నాయి. దండకారణ్యంలో సైతం జల్లెడ పడుతుండటంతో మావోలు తమ స్థావరాలను నిత్యం మార్చుకుంటున్నారు. అయినా బలగాల కంటపడి ఎన్​కౌంటర్​లలో మృతి చెందుతున్నారు. మరోవైపు ఎన్​కౌంటర్​లలో కీలక నేతలు మృతి చెందుతుండడం మావోలను కలవర పెడుతుంది. ఈ క్రమంలోనే తాము శాంతి చర్చలకు సిద్ధమని వారు గతంలో ప్రకటించారు. ఆపరేషన్​ కగార్(Operation Kagar)​ ఆపాలని డిమాండ్​ చేశారు. అయితే కేంద్ర మాత్రం చర్చలకు తావు లేదని స్పష్టం చేసింది. ఆయుధాలు వీడి లొంగిపోవాలని మావోయిస్టులకు సూచించింది.

    READ ALSO  Mumbai | ప్రయాణికుడి పొట్టలో రూ.11 కోట్ల కొకైన్​

    Latest articles

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...

    Job Notification | గుడ్​న్యూస్​.. ఆ పోస్టల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల

    అక్షరటుడే, హైదరాబాద్: Job Notification : తెలంగాణలో ఖాళీగా ఉన్న డెంటల్ అసిస్టెంట్​ సర్జన్​, స్పీచ్​ పాథాజిస్ట్​ పోస్టుల...

    Cm Revanth Habbits | రేవంత్‌ మందు ముట్టరు.. సిగరెట్​ తాగరు.. ఎంపీ కొండా ఆసక్తికర వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Cm Revanth Habbits : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణ యూత్‌ ఐకాన్‌ (Telangana youth...

    PADMASHALI SANGHAM | పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడిగా చంద్రశేఖర్

    అక్షరటుడే నిజాంసాగర్: PADMASHALI SANGHAM | పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడిగా గాజుల చంద్రశేఖర్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజాంసాగర్...

    More like this