More
    HomeసినిమాThe Raja Saab | రిలీజ్​కు ముందే ‘రాజాసాబ్​’ రికార్డులు

    The Raja Saab | రిలీజ్​కు ముందే ‘రాజాసాబ్​’ రికార్డులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : The Raja Saab | ప్రభాస్ (Prabhas)​ హీరోగా తెరకెక్కిన ది రాజాసాబ్ (Raja Saab)​ రిలీజ్​కు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది. మారుతి (Maruti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్​కు మంచి స్పందన లభించింది.

    బాహుబలి, సలార్​, కల్కి సినిమాలతో ప్రభాస్​ పాన్​ ఇండియా హీరోగా మారిపోయాడు. దీంతో ఆయన సినిమాలకు హిందీ (Bollywood)లో కూడా విపరీతంగా క్రేజ్​ ఉంది. ఈ క్రమంలో ది రాజాసాబ్ (The Raja Saab)​ సినిమా రిలీజ్​కు ముందే హిందీ మార్కెట్​లో రికార్డులు సాధిస్తోంది. హిందీలో ఇప్పటి వరకు రూ.75 కోట్ల బిజినెస్​ పూర్తి చేసింది. ఐవీ ఎంటర్​టైన్​మెంట్​ సంస్థ ది రాజాసాబ్​ హిందీ హక్కులను రూ.75 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. మ్యూజిక్​ హక్కులను రూ.25 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో ఓటీటీ, టీవీ హక్కుల రూపంలో మరో రూ.70 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో రాజాసాబ్​ మూవీ రిలీజ్​కు ముందే రూ.150 కోట్లకు మించి వసూలు కలెక్ట్​ చేయనుంది.

    READ ALSO  8 Vasanthalu | 8 వసంతాలు మూవీ ఫుల్ రివ్యూ.. సినిమా హిట్ కొట్టినట్టేనా?

    The Raja Saab | రిలీజ్​ ఎప్పుడంటే..

    హరర్​ కామెడీగా తెరకెక్కుతున్న రాజాసాబ్​ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్​ నటించిన కల్కి (Kalki) సినిమా గతేడాది 2024 జూన్​లో విడుదలైంది. ఏడాది నుంచి ప్రభాస్​ సినిమాలు లేకపోవడంతో రాజాసాబ్​ కోసం డార్లింగ్​ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్​ అయ్యే అవకాశం లేదు. డిసెంబర్​లో మూవీని విడుదల చేయడానికి మేకర్స్​ ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభాస్​ కీలక పాత్రలో నటించిన కన్నప్ప (Kannappa Movie) మాత్రం జూన్​ 27(శుక్రవారం) రిలీజ్​ కానుంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్​ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో డార్లింగ్​ ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు.

    READ ALSO  Actress Laya | చెప్పులు లేకుండా సినిమా మొత్తం పరిగెత్తాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ల‌య‌

    Latest articles

    ACB Case | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Case | రాష్ట్రంలో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల పని పట్టడమే...

    Honor X9c 5G | 108MP కెమెరా, 6,600mAh బ్యాటరీతో మిడ్-రేంజ్‌లో సెన్సేషన్.. ధర, ఫీచర్లు ఇవే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Honor X9c 5G | భారత మార్కెట్‌లో హానర్ స్మార్ట్ ఫోన్ మరోసారి తన దూకుడు...

    Subhansh Shukla | జీరో గ్రావిటీలో న‌డ‌క నేర్చుకుంటున్నా.. భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Subhansh Shukla | అంత‌రిత‌క్ష ప్ర‌యాణంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదిస్తున్నాన‌ని భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డించారు....

    Bangalore House Rents | బెంగ‌ళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bangalore House Rents | మ‌న తెలుగు వారు సిలికాన్ సిటీ బెంగ‌ళూరుకి (Bangalore) ఉద్యోగాల కోసం...

    More like this