More
    Homeఅంతర్జాతీయంB-2 Bombers | అమెరికా బీ-2 బాంబర్ల రూపకల్పనలో భారత సంతతి ఇంజినీర్ కీలక పాత్ర.....

    B-2 Bombers | అమెరికా బీ-2 బాంబర్ల రూపకల్పనలో భారత సంతతి ఇంజినీర్ కీలక పాత్ర.. కానీ..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: B-2 Bombers | ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లతో(B-2 Spirit stealth bombers) దాడులు చేసిన విష‌యం తెలిసిందే. గబ్బిలం ఆకారంలో ఉండే ఈ బాంబర్ల గురించి ఇప్పుడు తెగ చ‌ర్చ న‌డుస్తుంది. వాటిగొప్పతనం గురించి అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రపంచంలో మరే దేశం వద్ద లేని B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ల తయారీలో ఓ భారత ఇంజినీర్(Indian engineer) కీలకంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. ఇరాన్‌ పై అమెరికా ఆపరేషన్ మిడ్‌ నైట్ హ్యామర్ (Operation Midnight Hammer)లో మోహరించిన బీ-2 స్పిరిట్ బాంబర్ల స్టెల్త్ ప్రొపల్షన్ సిస్టమ్‌ ను అభివృద్ధి చేయడంలో భారతదేశంలో జన్మించిన ఓ ఇంజినీర్ కీలక పాత్ర పోషించారు. ఆయన పేరు.. నోషిర్ షెరియార్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia). అయితే… గోవాడియా స్టెల్త్ మిసైల్ ఎగ్జాస్ట్ డిజైన్ చేయడంలో చైనాకు సహాయం చేశారని ఎఫ్.బీ.ఐ. నిర్ధారించింది. దీంతో.. కోర్టు ఆయనకు 32 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.

    READ ALSO  Shubanshu Shukla | ఐఎస్​ఎస్​లో అడుగుపెట్టిన శుభాంశు శుక్లా

    B-2 Bombers | ఆ త‌ప్పుకి జైలు..

    ముంబైలో 1944లో జన్మించిన గోవాడియా, 1960లలో అమెరికాకు వలస వెళ్లి నార్త్‌రప్ గ్రమ్మన్ కార్పొరేషన్‌లో డిజైన్ ఇంజనీర్‌గా చేరారు. బి-2 స్పిరిట్ బాంబర్లను రాడార్లకు, ఇన్‌ఫ్రారెడ్ స్కానర్లకు(Infrared scanners), కంటికి కూడా అంత సులభంగా చిక్కకుండా చేసే సాంకేతికత అభివృద్ధిలో ఆయనది కీలక పాత్ర. ముఖ్యంగా, వినూత్నమైన ఎగ్జాస్ట్ ఆకృతులు, రాడార్ తరంగాలను శోషించుకునే పదార్థాల రూపకల్పనలో ఆయన ప్రతిభ కనబరిచారు. ఈ సిస్టమ్ బాంబర్‌ను రాడార్ , హీట్-సీకింగ్ మిసైళ్ల నుండి రక్షించే స్టెల్త్ సాంకేతికతను అభివృద్ధి చేశాడు. 1968 నుండి 1986 వరకు నార్త్‌రాప్ గ్రుమ్మన్ కార్పొరేషన్ లో ఇంజనీర్‌గా పనిచేశాడు.

    2003 నుండి 2005 వరకు గోవాడియా ఆరు సార్లు చైనాకు రహస్యంగా వెళ్లాడని గుర్తించారు. చైనా రక్షణ ఇంజనీర్లకు స్టెల్త్ క్రూయిజ్ మిసైల్ ఎగ్జాస్ట్ నాజిల్ రూపకల్పనలో సహాయం చేసినట్లుగా గుర్తించారు. ఈ సాంకేతికత చైనా క్రూయిజ్ మిసైళ్లను(China Cruise missiles) రాడార్ , ఇన్‌ఫ్రారెడ్ డిటెక్షన్ నుండి తప్పించేలా చేసింది. ఈ సేవలకు చైనా నుండి 1,10,000 డాలర్లు అంటే సుమారు రూ.91 లక్షలు అందుకున్నట్లుగా ఆధారాలు లభించాయి. ఆ డబ్బుతో హవాయిలోని తన విలాసవంతమైన ఇంటి తనఖాను చెల్లించారని నివేదికలు తెలిపాయి. జర్మనీ, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్‌లోని కొందరు వ్యక్తులకు కూడా గోవాడియా రహస్య డిజైన్ సమాచారాన్ని విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. అక్టోబర్ 2005లో, FBI గోవాడియాను అరెస్టు చేసింది. 500 పౌండ్ల రహస్య పత్రాలు , ఎలక్ట్రానిక్ ఆధారాలను స్వాధీనం చేసుకుంది. జనవరి 24, 2011న, 32 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం కొలరాడోలోని ADX ఫ్లోరెన్స్ సూపర్‌మాక్స్ జైలు లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2032లో విడుదలవుతాడు.

    READ ALSO  India - US | అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పీఠ‌ముడి

    Latest articles

    ACB Case | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Case | రాష్ట్రంలో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల పని పట్టడమే...

    Honor X9c 5G | 108MP కెమెరా, 6,600mAh బ్యాటరీతో మిడ్-రేంజ్‌లో సెన్సేషన్.. ధర, ఫీచర్లు ఇవే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Honor X9c 5G | భారత మార్కెట్‌లో హానర్ స్మార్ట్ ఫోన్ మరోసారి తన దూకుడు...

    Subhansh Shukla | జీరో గ్రావిటీలో న‌డ‌క నేర్చుకుంటున్నా.. భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Subhansh Shukla | అంత‌రిత‌క్ష ప్ర‌యాణంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదిస్తున్నాన‌ని భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డించారు....

    Bangalore House Rents | బెంగ‌ళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bangalore House Rents | మ‌న తెలుగు వారు సిలికాన్ సిటీ బెంగ‌ళూరుకి (Bangalore) ఉద్యోగాల కోసం...

    More like this

    ACB Case | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Case | రాష్ట్రంలో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల పని పట్టడమే...

    Honor X9c 5G | 108MP కెమెరా, 6,600mAh బ్యాటరీతో మిడ్-రేంజ్‌లో సెన్సేషన్.. ధర, ఫీచర్లు ఇవే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Honor X9c 5G | భారత మార్కెట్‌లో హానర్ స్మార్ట్ ఫోన్ మరోసారి తన దూకుడు...

    Subhansh Shukla | జీరో గ్రావిటీలో న‌డ‌క నేర్చుకుంటున్నా.. భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Subhansh Shukla | అంత‌రిత‌క్ష ప్ర‌యాణంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదిస్తున్నాన‌ని భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డించారు....