అక్షరటుడే, వెబ్‌డెస్క్: Eppeltone Engineers Ltd. IPO | ఆ కంపెనీ ఐపీవో(IPO) అలాట్ అయినవారికి లాభాల పంట పండింది. తొలిరోజే వారి పెట్టుబడి డబుల్ అయ్యింది. యూపీఎస్ సిస్టమ్స్(UPS Systems), హైగ్రేడ్ చార్జర్స్ వంటి వివిధ రకాల పవర్ కండిషనింగ్ ఎక్విప్‌మెంట్‌తో పాటు ఏవీఆర్, ఎంసీబీలు వంటి వివిధ రకాల ప్రొడక్ట్స్ తయారు చేసే ఎప్పెల్టోన్ ఇంజినీర్స్ లిమిటెడ్(Eppeltone Engineers Ltd. IPO) ఎస్‌ఎంఈ కంపెనీ ఐపీవోకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇన్వెస్టర్లనుంచి రూ. 43.96 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు బిడ్లను స్వీకరించింది. ఈ కంపెనీ షేర్లు మంగళవారం ఎన్‌ఎస్‌ఈ(NSE)లో లిస్ట్ అయ్యాయి. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 128కి ఆఫర్ చేయగా.. ఎన్ఎస్ఈలో రూ. 243 వద్ద లిస్టయ్యింది. ఆ తర్వాత 5 శాతం పెరిగి రూ. 255.35 వద్ద అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను తాకింది. అంటే తొలిరోజే ఒక్కో షేరుపై రూ. 127.35 లాభం వచ్చిందన్న మాట..
Eppeltone Engineers Ltd. IPO | ఒక్కో లాట్‌పై లాభం ఎంతంటే..
ఈ ఎస్‌ఎంఈ ఐపీవో లాట్ సైజ్(Lot size) వెయ్యి షేర్లు. ఒక లాట్ ధర రూ. 1,28,000. ఒక లాట్ అలాట్ అయినవారికి తొలిరోజే 1,27,350 లాభం వచ్చిందన్న మాట.