More
    Homeబిజినెస్​Ellenbarrie Industrial Gases IPO | నేటినుంచి మరో మెయిన్ బోర్డు ఐపీవో ప్రారంభం

    Ellenbarrie Industrial Gases IPO | నేటినుంచి మరో మెయిన్ బోర్డు ఐపీవో ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Ellenbarrie Industrial Gases IPO | ఎలెన్‌బారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ లిమిటెడ్(Ellenbarrie Industrial Gases Ltd) ఐపీవోకు వస్తోంది. ఈ కంపెనీ ఆక్సిజన్(Oxigen), కార్బన్ డయాక్సైడ్, ఎసిటిలీన్, నైట్రోజన్, హీలియం, హైడ్రోజన్, ఆర్గాన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి ముఖ్యమైన వాయువులను తయారు చేసి పారిశ్రామిక, వైద్య రంగాలకు సరఫరా చేస్తుంటుంది. రూ. 852.53 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) కింద రూ. 2 ఫేస్ వ్యాల్యూ(Face value) కలిగిన కోటి షేర్లను విక్రయించడం ద్వారా రూ. 400 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్(OFS) కింద రూ. 2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1.13 కోట్ల షేర్లను అమ్మడం ద్వారా రూ. 452.53 కోట్లు పొందాలని భావిస్తోంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ అప్పులు పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసం, ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌లో ఎయిర్ సపరేషన్ యూనిట్ ఏర్పాటు కోసం, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

    READ ALSO  Today gold price | ప‌సిడి ప్రియుల‌కు అల‌ర్ట్.. ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    ప్రైస్‌ బాండ్‌:ఐపీవో ధరల శ్రేణి(Price band)ని ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 380 నుంచి రూ. 400 గా కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్‌లో 37 షేర్లుంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం రూ. 14,800 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

    ముఖ్యమైన తేదీలు:ఐపీవో మంగళవారం ప్రారంభం కానుంది. గురువారం వరకు సబ్‌స్క్రిప్షన్‌(Subscription) స్వీకరిస్తారు. శుక్రవారం రాత్రి ఐపీవో అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ షేర్లు వచ్చేనెల ఒకటో తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ కానున్నాయి.

    వాటా:క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐ(NII)లకు, 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటా కేటాయించారు.

    జీఎంపీ:ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) రూ. 7 మాత్రమే ఉంది. అంటే లిస్టింగ్‌ రోజు 1.75 శాతమే లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

    READ ALSO  Globe Civil Projects IPO | రేపటి నుంచి ఓపెన్‌ అవ్వనున్న మరో ఐపీవో.. గ్రే మార్కెట్‌ ప్రీమియం ఎంతంటే..

    Latest articles

    TG PGECET | విడుదలైన టీజీ పీజీఈసెట్‌ 2025 ఫలితాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: TG PGECET | తెలంగాణ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (PGECET) -...

    Muruga Book | ఎన్టీఆర్ చేతిలో మురుగ‌న్ పుస్త‌కం.. ఆ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Muruga Book | పురాణ పురుషుల పాత్రలు పోషించేటప్పుడు న‌టీన‌టులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటారు. ఆ పాత్ర...

    Home Minister Amit Shah | కేంద్ర హోంమంత్రి పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Home Minister Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్​ షా జిల్లా పర్యటనకు...

    Stock Market | స్టాక్‌ మార్కెట్లు రయ్‌రయ్‌.. ఆల్‌టైం హైకి చేరువలో సెన్సెక్స్‌, నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) పరుగులు తీస్తున్నాయి. వరుసగా మూడో...

    More like this