అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | ఎస్సై, ఏఎస్సై సంతకాలను ఫోర్జరీ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్న పెద్ద కొడప్గల్ (Pedda kodapkal) కానిస్టేబుల్ రవికుమార్‌ను (Constable Ravikumar) సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొడప్గల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కానిస్టేబుల్ కె.రవికుమార్ బస్సు వారంట్ల కోసం ఏఎస్సై సంతకాలను ఫోర్జరీ చేశాడు.
అలాగే విధులకు గైర్హాజరైనప్పుడు ఉన్నతాధికారులకు ఎస్సై సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు నివేదికలు పంపించాడు. ఇలా కానిస్టేబుల్‌పై వచ్చిన ఆరోపణలపై బాన్సువాడ డీఎస్పీ నివేదికను పరిశీలించిన ఎస్పీ రాజేష్ చంద్ర తీవ్రంగా పరిగణించారు. ప్రస్తుతం దేవునిపల్లి పోలీసు స్టేషన్‌లో (Devunipalli Police Station) విధులు నిర్వహిస్తున్న రవికుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో ఎవరైనా బాధ్యతారాహిత్య ప్రవర్తన లేదా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.