More
    Homeబిజినెస్​Globe Civil Projects IPO | రేపటి నుంచి ఓపెన్‌ అవ్వనున్న మరో ఐపీవో.. గ్రే...

    Globe Civil Projects IPO | రేపటి నుంచి ఓపెన్‌ అవ్వనున్న మరో ఐపీవో.. గ్రే మార్కెట్‌ ప్రీమియం ఎంతంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Globe Civil Projects IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic stock market)లో లిస్టవడం కోసం మరో ఐపీవో (IPO)వస్తోంది. మంగళవారం నుంచి గ్లోబ్‌ సివిల్‌ ప్రాజెక్ట్స్‌ ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుంది. జీఎంపీ 20 శాతం ఉంది.

    ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ(Delhi), హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖంఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ వంటి ఈపీసీ సేవలందించే గ్లోబ్‌ సివిల్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తోంది. ఫ్రెష్‌ ఇష్యూ(Fresh issue) ద్వారా రూ. 10 ఫేస్‌ వ్యాల్యూ కలిగిన 1.67 కోట్ల షేర్లను విక్రయించి రూ. 119 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం. ఐపీవో ద్వారా వచ్చేమొత్తాన్ని కొత్త మెషినరీ కొనుగోలు చేయడానికి, క్యాపిటల్‌ ఎక్స్పెండిచర్‌ అవసరాల కోసం, కంపెనీ వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనున్నట్లు తెలిపింది.

    READ ALSO  Stock Market | లార్జ్‌ క్యాప్‌లో ర్యాలీ.. లాభాల్లో ప్రధాన సూచీలు

    Globe Civil Projects IPO | కంపెనీ పరిస్థితి..

    2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 334.81 కోట్ల రెవెన్యూ(Revenue) ద్వారా రూ. 15.38 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు కంపెనీ రూ. 256.74 కోట్ల రెవెన్యూ, రూ. 17.79 కోట్ల నికర లాభాన్ని రికార్డు చేసింది. కంపెనీ ఆస్తులు ఇదే సమయంలో రూ. 317.83 కోట్లనుంచి రూ. 374.60 కోట్లకు పెరిగినట్లు ఆర్‌హెచ్‌పీలో చూపించింది.

    Globe Civil Projects IPO | ఐపీవో ప్రైస్‌ బాండ్‌..

    కంపెనీ ప్రైస్‌ బాండ్‌(Price band)ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 67 నుంచి రూ. 71గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 211 షేర్లుంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం రూ. 14,981 తో బిడ్‌ వేయాల్సి ఉంటుంది.

    READ ALSO  Ellenbarrie Industrial Gases IPO | నేటినుంచి మరో మెయిన్ బోర్డు ఐపీవో ప్రారంభం

    Globe Civil Projects IPO | ఐపీవో తేదీలు..

    మంగళవారం ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌(Subscription) ప్రారంభమవుతుంది. 26తో ముగుస్తుంది. 27వ తేదీ రాత్రి అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు వచ్చేనెల ఒకటో తేదీన ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్‌ కానున్నాయి.

    Globe Civil Projects IPO | వాటా

    ఈ ఐపీవోలో క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం వాటాను కంపెనీ కేటాయించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం రిజర్వ్‌ చేశారు.

    Globe Civil Projects IPO | GMP

    గ్లోబ్‌ సివిల్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ఐపీవోకు గ్రే మార్కెట్‌ ప్రీమియం(జీఎంపీ) 14 రూపాయలు ఉంది. అంటే 20 శాతం ప్రీమియంతో గ్రే మార్కెట్‌లో ట్రేడ్‌ అవుతున్నాయి. జీఎంపీ ఇలాగే ఉంటే లిస్టింగ్‌ రోజు 20 శాతం లాభం వచ్చే అవకాశాలున్నాయి.

    READ ALSO  LOVE | ప్రేమించినవాడు దక్కలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది..!

    Latest articles

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...

    More like this

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...