More
    Homeఅంతర్జాతీయంUS attacks on iran | ఇరాన్​ అణు కేంద్రాలపై అమెరికా భీకర దాడి.. మరో...

    US attacks on iran | ఇరాన్​ అణు కేంద్రాలపై అమెరికా భీకర దాడి.. మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఇరాన్​, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో తాజాగా అగ్రరాజ్యం అమెరికా చేరింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై యూఎస్​ తమ ఫైటర్‌ జెట్లతో భీకర దాడికి దిగింది. ఇరాన్‌పై దాడి చేసి ఫైటర్‌ జెట్లు సురక్షితంగా తిరిగి వెనక్కి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు.

    ఫోర్డోపై బాంబులు వేశాం. ఇరాన్‌ గగనతలం బయట నుంచే ఈ దాడులు నిర్వహించాం. విమానాలు సురక్షితంగా తిరిగివచ్చాయి. అమెరిఇరాన్‌పై అమెరికా విరుచుకుపడింది. అమెరికా బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో ఫోర్డో, ఇస్ఫాహన్, నతాంజ్‌ అణుకేంద్రాలపై భారీ దాడులు చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ‘‘ఇరాన్‌ గగనతలం బయట నుంచే ఈ దాడులు నిర్వహించాం. అమెరికా సైనిక యోధులకు అభినందనలు. ఇప్పుడు ఇక శాంతికి సమయం.’’ అని పోస్టు చేశారు. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడికి పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. తమ విమానాలు సురక్షితంగా ఉన్నాయని ట్రంప్​ స్పష్టం చేశారు.

    READ ALSO  Stock Market | భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మరోసారి 25వేల పాయింట్లు దాటిన నిఫ్టీ

    ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అణు కేంద్రాలపై బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో తాము విజయవంతమైన దాడిని పూర్తి చేసినట్లు ట్రంప్ శనివారం రాత్రి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ″అన్ని విమానాలు సురక్షితంగా వెనక్కి చేరుకున్నాయి. మన అమెరికన్ వారియర్లకు అభినందనలు. ప్రపంచంలో మరే సైన్యం ఈ సాహసం చేయలేదు. ఇక ఇది శాంతికి సమయం!” అని ట్రంప్‌ పేర్కొన్నారు. శనివారం రాత్రి 10 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

    ఇటీవలే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న వివాదం దౌత్యపరంగా పరిష్కరించడానికి అమెరికా రెండు వారాలు సమయం ఇస్తున్నట్లు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్‌.. ఆ మాట చెప్పిన 48 గంటలల్లోపే ఇరాన్‌పై బీ 2 బాంబర్లతో విరుచుపడ్డారు.

    ఇరాన్​, ఇజ్రాయెల్​ యుద్ధం నేపథ్యంలో ఓ వైపు ఇరాన్​కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందనే ప్రచారంలో ఉంది. ఇప్పుడేమో ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా జత కలిసింది. ఇరాన్​పై దాడికి పాల్పడింది. ఈ తరుణంలో మరి చైనా, రష్యా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామం మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది.

    READ ALSO  Cyber ​​Crime | రూ. 2 వేల కోట్ల సైబర్‌ మోసం.. ఏకంగా చైనాతో లింకులు!

    Latest articles

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...

    More like this