More
    HomeతెలంగాణHyderabad CP Anand | ప్రైవేట్​ పాఠశాలలకు హైదరాబాద్​ సీపీ వార్నింగ్

    Hyderabad CP Anand | ప్రైవేట్​ పాఠశాలలకు హైదరాబాద్​ సీపీ వార్నింగ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad CP Anand | ప్రైవేట్​ పాఠశాలలు విద్యార్థులను తీసుకువెళ్లడానికి సురక్షితమైన మార్గాలను వినియోగించాలని హైదరాబాద్​ సీపీ ఆనంద్(Hyderabad CP Anand)​ సూచించారు. పాఠశాలల యాజమాన్యాలు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రవీంద్ర భారతి(Ravindra Bharati)లో ప్రైవేట్​ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.

    Hyderabad CP Anand | ట్రాఫిక్​ మార్షల్స్​ నియమించుకోవాలి

    ప్రైవేట్​ పాఠశాలలు(Private schools) ఫిట్​నెస్​ ఉన్న బస్సులనే వినియోగించాలని సీపీ సూచించారు. కార్యక్రమానికి కలెక్టర్, RTA, RTC అధికారులు, 750 మంది పాఠశాల ప్రతినిధులు హాజరయ్యారు. సీపీ మాట్లాడుతూ.. పాఠశాలలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను ట్రాఫిక్ మార్షల్స్‌(Traffic marshals)గా నియమించుకోవాలని ఆయన సూచించారు. పాఠశాల వెలుపల, లోపల 200 మీటర్ల పొడవునా ట్రాఫిక్‌ను నియంత్రించాలన్నారు. వారికి ట్రాఫిక్ పోలీసులు(Traffic police) శిక్షణ ఇస్తారని చెప్పారు. మైనర్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్, ప్రమాదకర రవాణాను సహించబోమని కమిషనర్ స్పష్టం చేశారు.

    READ ALSO  Konda Murali | ఆ శాఖల్లో ఐదు పైసలు రావు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

    Hyderabad CP Anand | సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

    పాఠశాలలో, బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీపీ ఆనంద్​ సూచించారు. కొన్ని చోట్ల మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నందున పాన్ షాపులు(Pawn shops) మరియు పాఠశాలల సమీపంలోని ఇతర చిన్న దుకాణాలను తొలగించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

    Latest articles

    PM Modi | ట్రంప్​ ఆథిత్యం కన్న జగన్నాథుడి దర్శనమే ముఖ్యం : పీఎం మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US President Trump)​ ఆహ్వానం...

    Yellareddy | మాదక ద్రవ్యాల నిరోధానికి కట్టుబడి ఉండాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని ఎల్లారెడ్డి మోడల్​ స్కూల్​ ప్రిన్సిపాల్​...

    CM Revanth | బీఆర్ఎస్‌ రాజకీయంగా చచ్చిపోయింది: సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth | రాష్ట్రంలో బీఆర్​ఎస్ (BRS)​ రాజకీయంగా ఎప్పుడో చచ్చిపోయిందని సీఎం రేవంత్​రెడ్డి (CM...

    Hanmakonda | హన్మకొండ కోర్టుకు బాంబు బెదిరింపు.. ఆరు డిటోనేటర్ల స్వాధీనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hanmakonda | హన్మకొండ కోర్టు (Hanmakonda court)కు బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది....

    More like this