అక్షరటుడే, వెబ్‌డెస్క్: ChatGPT in WhatsApp : వాట్సప్ వినియోగదారులకు శుభవార్త. ఈ సంస్థ తన ఖాతాదారులకు అధునాతన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఓపెన్ AI చాట్‌బాట్ చాట్ జీపీటీని (open AI chatbot ChatGPT) ఇమేజ్ జనరేషన్ ఫీచర్ తాజాగా వాట్సప్ లోనూ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ఇప్పటి వరకు ChatGPT వెబ్, మొబైల్ యాప్ లలో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా వాట్సప్ లో 1-800-ChatGPT ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా ‘X’ ద్వారా కంపెనీ ప్రకటించింది.
“చాట్ జీపీటీని వాట్సప్ లోని 1-800-ChatGPTకి లింక్ చేసి మరిన్ని ఇమేజ్‌లు జనరేషన్ చేసుకోవచ్చు. గత డిసెంబరులో చాట్‌బాట్‌ను వాట్సప్ ద్వారా యాక్సెస్ కు అనుమతి లభించింది. 1-800-ChatGPT అని పిలిచే ఈ ప్రయోగాత్మక సర్వీస్ ఖాతా.. చాట్ జీపీటీని మరింత యాక్సెస్ పొందేలా అనుమతిస్తోంది.
వాట్సప్ లో చాట్ జీపీటీ ఎలా వినియోగించాలంటే..
- ఫోన్ కాంటాక్ట్ లలో 1-800-ChatGPT అధికారిక నంబరు +1-800-242-8478 సేవ్ చేసుకోవాలి.
- తర్వాత WhatsApp ఓపెన్ చెయ్యాలి. అనంతరం ఆ నంబరుకు “హాయ్” అని మేసేజ్ చెయ్యాలి.
- అనంతరం Open Al ఖాతాను ధృవీకరించమని అడుగుతుంది. అలా లాగిన్ అవ్వడానికి లింక్‌ను ఫాలో కావాలి.
- లింక్ చేశాక.. ఏ ఇమేజ్ కావాలంటే దాని కంటెంట్ ఇచ్చి ఇమేజ్ను సృష్టించుకోవచ్చు.