More
    Homeజిల్లాలుహైదరాబాద్Hydraa | చ‌ర్ల‌ప‌ల్లి చెరువు ఆధునికీకరణకు హైడ్రా చర్యలు

    Hydraa | చ‌ర్ల‌ప‌ల్లి చెరువు ఆధునికీకరణకు హైడ్రా చర్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని చ‌ర్ల‌ప‌ల్లి చెరువు (Charlapalli Lake) రూపు రేఖ‌లు మార‌నున్నాయి. జైళ్ల శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ సౌమ్య మిశ్రా ఆహ్వానం మేర‌కు హైడ్రా క‌మిష‌న‌ర్(Hydraa Commissioner) ఏవీ రంగ‌నాథ్ గురువారం చ‌ర్ల‌ప‌ల్లి చెరువును సంద‌ర్శించారు. జైళ్ల శాఖ‌, హైడ్రాతో పాటు.. స్థానిక రెవెన్యూ, ఇరిగేష‌న్‌, జీహెచ్ ఎంసీ అధికారులు కూడా ఈ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. చ‌ర్ల‌ప‌ల్లి జైలు ప్రాంతంలో ఉన్న 58 ఎక‌రాల చెరువును ఆధునికీక‌రించ‌డంతో పాటు సుంద‌రంగా తీర్చిదిద్ద‌డంపై ఉన్న‌తాధికారులు చ‌ర్చించారు.

    Hydraa | అభివృద్ధి చేయడానికి చర్యలు

    చెరువు చుట్టూ తిరిగి.. ఇన్‌లెట్‌, ఔట్‌లెట్‌ల‌ను ప‌రిశీలించారు. ప్ర‌స్తుతం చెరువులో కొద్దిమొత్తం నీరు ఉన్నా ప‌రిశుభ్రంగా ఉండ‌డంతో జీవ‌వైవిద్యానికి అవ‌కాశం ల‌భించింద‌ని.. ఇంకా ఈ చెరువు నిండా నీరుంటే మ‌రింత ఆహ్లాదంగా మారుతుంద‌ని భావించారు. ఈ క్ర‌మంలో చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి.. ప‌ర్యాట‌క‌, విహార కేంద్రంగా తీర్చిదిద్ద‌డంపై చ‌ర్చించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు.. క‌ట్ట‌ను బ‌లోపేతం చేసి పాత్‌వేను అభివృద్ధి చేయ‌డం వంటి పనులు వెంట‌నే చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. అలాగే సోలార్ లైటింగ్ సిస్టమ్‌తో పాటు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మ‌రింత భ‌ద్ర‌త ఉంటుంద‌ని భావించారు.

    READ ALSO  Real Estate | తెలంగాణలో ఊపందుకున్న 'రియల్' రంగం.. భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం

    హ‌కీంపేట నుంచి నాగిరెడ్డి కుంట‌, కాప్రా చెరువు, మోతుకుల‌కుంట‌, బైస‌న్‌కుంట గొలుసుక‌ట్ట‌ చెరువుల ద్వారా చ‌ర్ల‌ప‌ల్లి చెరువుకు నీరందుతుంది. ఈ చెరువుకు.. మురుగు నీరు క‌ల‌వ‌కుండా డైవ‌ర్ట్ నాలా కూడా ఉంది. చెరువు చుట్టూ దాదాపు మూడు కిలోమీట‌ర్ల మేర న‌డ‌క దారి అందుబాటులోకి వ‌స్తుంది. చ‌ర్ల‌ప‌ల్లి ప‌రిశ్ర‌మ‌లకు చెందిన ప్ర‌తినిధులు సామాజిక బాధ్య‌త (సీఎస్ఆర్‌) కింద నిధులు స‌మ‌కూర్చ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని సౌమ్య మిశ్రా చెప్పారు. ఒక్కో సెగ్మెంట్‌కు ఎంత ఖ‌ర్చు అవుతుందో స‌మ‌గ్ర నివేదిక ఇస్తే ఆ క్ర‌మంలో సీఎస్ఆర్ నిధులు అడ‌గ‌డానికి వీలవుతుంద‌న్నారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 20 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – జ్యేష్ఠపక్షం...

    ChatGPT in WhatsApp | WhatsApp లో ChatGPT.. ఇమేజ్​ జనరేషన్​ ఆప్షన్​ ఎలా అంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ChatGPT in WhatsApp : వాట్సప్​ వినియోగదారులకు శుభవార్త. ఈ సంస్థ తన ఖాతాదారులకు అధునాతన...

    Operation Sindhu | ఆపరేషన్​ సింధు.. ఇజ్రాయెల్​లోని వారినీ తరలింపునకు కేంద్రం నిర్ణయం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Operation Sindhu : ఇజ్రాయెల్(Israel) - ఇరాన్(Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కేంద్ర...

    Iran-Israel war | ఇరాన్​ ఇజ్రాయెల్​ యుద్ధం.. మధ్యలో తల దూర్చిన అమెరికా.. ఇక రష్యా ఎంట్రీ!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran-Israel war : పశ్చిమాసియా(West Asia)లో ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ...

    More like this