More
    Homeబిజినెస్​Laurus Labs | అంతకు మించి.. అద్భుత ఫలితాలు సాధించిన లారస్‌ ల్యాబ్స్‌

    Laurus Labs | అంతకు మించి.. అద్భుత ఫలితాలు సాధించిన లారస్‌ ల్యాబ్స్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Laurus Labs |లారస్‌ ల్యాబ్స్‌(Laurus Labs) నాలుగో త్రైమాసికంలో మంచి పనితీరును కనబరిచింది. విశ్లేషకుల అంచనాలకు మించి లాభాలు(Profits) ఆర్జించింది. సీడీఎంవోకు మంచి డిమాండ్‌ ఉండడంతో ఈ వృద్ధి నమోదయ్యిందని భావిస్తున్నారు.

    Laurus Labs | నికర లాభం మూడింతలు..

    2023-24 చివరి క్వార్టర్‌లో రూ.76 కోట్లున్న నెట్‌ ప్రాఫిట్‌(Net profit).. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌కు రూ. 234 కోట్లకు చేరింది. సుమారు 210 శాతం లాభం పెరిగింది. కాగా నికర లాభం రూ. 185 కోట్లుగా ఉంటుందని మార్కెట్‌ అనలిస్టు(Analysts)లు అంచనా వేశారు. నెట్‌ ప్రాఫిట్‌ పూర్తి సంవత్సరానికి రూ. 161 కోట్లనుంచి రూ. 358 కోట్లకు పెరిగింది. అంటే 120 శాతానికిపైగా లాభాలు పెరిగాయి.

    Laurus Labs | రెవెన్యూ..

    ఆదాయం 19.5 శాతం పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(Financial year) నాలుగో త్రైమాసికంలో రూ. 1,440 కోట్లున్న ఆదాయం.. సమీక్ష త్రైమాసికంలో రూ. 1,720 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 5,041 కోట్లున్న ఆదాయం.. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం పెరిగి రూ. 5,554 కోట్లకు చేరింది.

    READ ALSO  Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Laurus Labs | ఈపీఎస్‌

    ఈపీఎస్‌(Earning Per Share) సైతం గణనీయంగా పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 2.9 గా ఉన్న ఈపీఎస్‌.. ఈసారి రూ. 6.60 కి చేరింది.

    Laurus Labs | డివిడెండ్‌..

    కంపెనీ డివిడెండ్‌(Dividend) ప్రకటించింది. ప్రతి షేరుపై రూ. 0.80 డివిడెండ్‌ ఇవ్వనుంది. రికార్డు డేట్‌ నిర్ణయించాల్సి ఉంది.

    Laurus Labs | స్టాక్‌ పనితీరు..

    లారస్‌ ల్యాబ్స్‌ అద్భుతమైన ఫలితాలను సాధించినా.. గత ట్రేడింగ్‌ సెషన్‌(Last trading session)లో మాత్రం 3.08 శాతం క్షీణించి రూ. 626 వద్ద స్థిరపడింది. భారత్‌, పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌(Profit booking)కు దిగడంతో స్టాక్‌ ధర పడిపోయింది. కాగా ఈ స్టాక్‌ 52 వారాల గరిష్ట ధర రూ. 661 కాగా.. కనిష్ట ధర రూ. 385. గత ఐదేళ్లలో స్టాక్‌ ప్రైస్‌ సీఏజీఆర్‌(CAGR) 43 శాతంగా నమోదయ్యింది.

    READ ALSO  Stock Market | భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Laurus Labs | సీడీఎంవో సెగ్మెంట్‌లో భారీ వృద్ధి..

    కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆర్గనైజేషన్‌ విభాగం నుంచి రూ. 1,374 కోట్ల ఆదాయం వచ్చింది. ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 49 శాతం వృద్ధి నమోదయ్యింది. సీడీఎంవో(CDMO) విభాగంలో ఎక్కువ ప్రాజెక్టులు నిర్వహించడం వల్లే మంచి ఫలితాలు సాధించగలిగామని కంపెనీ సీఈవో సత్యనారాయణ పేర్కొన్నారు. పలు కొత్త ప్రాజెక్టులూ(New projects)చేపడుతున్నామన్నారు. అంతర్జాతీయంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నా.. భవిష్యత్‌లో మరింత రాణిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

    Latest articles

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​...

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...

    Iran Missile Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడి.. రాయబార కార్యాలయం మూసివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Missile Attack | ఇజ్రాయెల్‌పై (Israel) దాడులను అడ్డుకుంటే అమెరికా, ఫ్రాన్స్‌ తదితర...

    More like this

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​...

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...