More
    HomeజాతీయంFalcon business jets | ఎలైట్ క్లబ్​లోకి ఇండియా.. ఫాల్కన్ బిజినెస్ జెట్ల తయారీ భారత్​లోనే..

    Falcon business jets | ఎలైట్ క్లబ్​లోకి ఇండియా.. ఫాల్కన్ బిజినెస్ జెట్ల తయారీ భారత్​లోనే..

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Falcon business jets : విమానయాన రంగంలో భారత్ స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే వైమానిక ఉత్పత్తులకు కేంద్రంగా మారిన ఇండియా మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు వేదిక కానుంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ, ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్​తో కలిసి ఇండియాలో ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్లను ఉత్పత్తి చేయనుంది. ఈ మేరకు బుధవారం ఒక సంయుక్త ప్రకటన వెలువడింది.

    మహారాష్ట్రలోని నాగ్​పూర్​ జెట్ల కోసం తుది అసెంబ్లీ లైన్​ను ఏర్పాటు చేయనున్నాయి. డసాల్ట్ ఫ్రాన్స్ వెలుపల ఫాల్కన్ 2000 జెట్లను తయారు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

    Falcon business jets : 2028 నాటికి ఉత్పత్తి..

    ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ 2028 నాటికి కార్పొరేట్, సైనిక ఉపయోగాల కోసం ఇండియాలో తయారు చేసిన మొదటి జెట్లను డెలివరీ చేయాలని ప్రణాళికలు వేస్తోంది. ఫాల్కన్ 2000LXS బిజినెస్ జెట్లను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడానికి ఫ్రెంచ్(France) విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్(Dassault Aviation), రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్(Reliance Aerostructures Ltd) బుధవారం నాగ్​పూర్(Nagpur)​లో లగ్జరీ విమానాలను తయారు చేయడానికి తమ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. డసాల్ట్ తో రిలయన్స్ జట్టు కట్టిందన్న వార్తల నేపథ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 5% పెరిగాయి.

    READ ALSO  Plane Crash | విమాన ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం

    ఫాల్కన్ 2000LXS జెట్ 8 నుంచి 10 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. నాగ్​పూర్​లోని డస్సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (DRAL) నుంచి 2028 నాటికి మొదటి మేడిన్ ఇండియా జెట్ విమానం ఉత్పత్తి అవుతుందని ఫ్రెంచ్ విమాన తయారీ సంస్థ తెలిపింది. DRAL అనేది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్​తో డస్సాల్ట్ జాయింట్ వెంచర్. అంతే అనుకూలిస్తే సంవత్సరానికి 24 జెట్లను ఉత్పత్తి చేస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు.

    “డస్సాల్ట్ ఏవియేషన్ ఫ్రాన్స్ వెలుపల ఫాల్కన్ 2000 జెట్లను తయారు చేయడం ఇదే మొదటిసారి. ఇది భారతదేశాన్ని వ్యూహాత్మక ప్రపంచ విమానయాన కేంద్రంగా ఉంచుతుంది” అని డస్సాల్ట్ ఏవియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ United States, ఫ్రాన్స్ France, కెనడా Canada, బ్రెజిల్ Brazil​తో సహా తదుపరి తరం వ్యాపార జెట్లను తయారు చేసే దేశాల ఎలైట్ క్లబ్​ elite club లో ఇండియా Indiaచేరిందని పేర్కొంది.

    READ ALSO  Maoists | బంద్​కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

    Latest articles

    Yoga | ఒత్తిడిని చిత్తు చేయాలంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Yoga | ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు ఒత్తిడి(Stress)కి లోనవుతున్నారు. దీంతో రకరకాల మానసిక,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 19 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – గురువారంమాసం – జ్యేష్ఠపక్షం...

    Tamil Nadu | ప్రియుడి కోసం పెళ్లి మండపంలోనే దొంగతనం చేసిన ప్రియురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu : ఇటీవల లవర్ కోసం కొందరు మహిళలు ఎంతకైనా బరితెగిస్తున్నారు. కట్టుకున్న భర్తను...

    Donald Trump | ఐ లవ్‌ పాకిస్తాన్‌ అంటూ ట్రంప్‌ వ్యాఖ్యలు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ వివాదాన్ని...

    More like this

    Yoga | ఒత్తిడిని చిత్తు చేయాలంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Yoga | ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు ఒత్తిడి(Stress)కి లోనవుతున్నారు. దీంతో రకరకాల మానసిక,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 19 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – గురువారంమాసం – జ్యేష్ఠపక్షం...

    Tamil Nadu | ప్రియుడి కోసం పెళ్లి మండపంలోనే దొంగతనం చేసిన ప్రియురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu : ఇటీవల లవర్ కోసం కొందరు మహిళలు ఎంతకైనా బరితెగిస్తున్నారు. కట్టుకున్న భర్తను...