More
    HomeతెలంగాణGadwal | రైతులకు బేడీలు.. పోలీసులపై సస్పెన్షన్​ వేటు

    Gadwal | రైతులకు బేడీలు.. పోలీసులపై సస్పెన్షన్​ వేటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Gadwal | రైతులకు బేడీలు వేయడంపై ప్రభుత్వం సీరియస్​ అయింది. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు పోలీసులపై చర్యలు చేపట్టింది.

    గద్వాల (Gadwal) జిల్లా పెద్ద ధన్వాడ (Pedda Dhanwada)లో నిర్మిస్తున్న ఇథనాల్​ ఫ్యాక్టరీ (Ethanol factory)కి వ్యతిరేకంగా రైతులు కొద్ది రోజుల క్రితం నిరసన తెలిపిన విషయం తెలిసిందే. కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు పనులు చేయడానికి వచ్చిన కూలీలను రైతులు తరిమి కొట్టారు. దీంతో పలువురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇథనాల్​ ఫ్యాక్టరీ ఘటనలో కేసు నమోదైన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారికి రిమాండ్​ విధించడంతో మహబూబ్​నగర్ (Mahabubnagar)​ జైలుకు తరలించారు. ​

    బుధవారంతో రైతుల రిమాండ్​ ముగియడంతో రాజోలి పోలీసులు (Rajoli Police) వారిని కోర్టులో హాజరు పరిచారు. అయితే ఈ సమయంలో రైతుల చేతులకు సంకెళ్లు వేశారు. అన్నదాతలకు బేడీలు వేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యులైన రాజోలి ఎస్సై రాజేశ్​కుమార్​, ఏఎస్సైలు రామకృష్ణ, శ్రీనివాస్​ను సస్పెండ్​ చేసింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ తొట్టి శ్రీనివాస్​ వారిని సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

    READ ALSO  Armoor Municipality | డబ్బులు తీసుకొని జీతాల పెంపు..! ఆర్మూర్​ బల్దియాలో అవినీతి బాగోతం

    Latest articles

    Yoga | ఒత్తిడిని చిత్తు చేయాలంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Yoga | ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు ఒత్తిడి(Stress)కి లోనవుతున్నారు. దీంతో రకరకాల మానసిక,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 19 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – గురువారంమాసం – జ్యేష్ఠపక్షం...

    Tamil Nadu | ప్రియుడి కోసం పెళ్లి మండపంలోనే దొంగతనం చేసిన ప్రియురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu : ఇటీవల లవర్ కోసం కొందరు మహిళలు ఎంతకైనా బరితెగిస్తున్నారు. కట్టుకున్న భర్తను...

    Donald Trump | ఐ లవ్‌ పాకిస్తాన్‌ అంటూ ట్రంప్‌ వ్యాఖ్యలు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ వివాదాన్ని...

    More like this