అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) బుధవారం రోజంతా ఒడిదుడుకుల మధ్య కొనసాగి చివరికి నష్టాలతో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 269 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 65 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. రోజంతా ఒడిదుడుకులు కొనసాగాయి. సెన్సెక్స్ 81,237 నుంచి 81,858 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,750 నుంచి 24,947 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 138 పాయింట్ల నష్టంతో 81,444 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 24,812 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈలో 1,532 కంపెనీలు లాభపడగా 2,448 స్టాక్స్ నష్టపోయాయి. 135 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 75 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 61 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. యూఎస్ ఫెడ్ మీటింగ్‌తో పాటు మధ్యప్రాచ్యం(Middle east)లో ఉద్రిక్తతలతో మార్కెట్లు కొంత ఒత్తిడికి లోనయ్యాయి. ఫైనాన్స్, ఆటో రంగాల షేర్లు రాణించడంతో ప్రారంభ నష్టాలు తగ్గాయి.
Stock Market | అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి
ఆటో సెక్టార్ స్టాక్స్ మినహా మిగతా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈలో ఆటో(Auto) ఇండెక్స్ 037 శాతం పెరిగింది. ఇన్‌ఫ్రా ఇండెక్స్ 0.92 శాతం పడిపోగా.. ఐటీ సూచీ(IT index) 75 శాతం నష్టపోయింది. పవర్ ఇండెక్స్ 0.67 శాతం, మెటల్ 0.65 శాతం, పీఎస్‌యూ సూచీ 0.61 శాతం పడిపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, ఎనర్జీ ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు నష్టాలబాటలో పయనించాయి. స్మాల్ క్యాప్(Small cap), మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 0.34 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం నష్టపోయాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో ఎలక్ట్రానిక్స్ మార్ట్(Electronics mart) 15.18 శాతం లాభపడగా.. జమ్నా ఆటో 5.55 శాతం, శాపర్స్ స్టాప్ 5.40 శాతం, జైడస్ వెల్‌నెస్ 4.92 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 4.44 శాతం పెరిగాయి.
Stock Market | Top losers..
ఓరియంట్ సిమెంట్(Orient cement) 16.67 శాతం, స్టెర్‌లైట్ టెక్నాలజీస్ 7.94 శాతం, హిందుస్థాన్ జింక్ 6.88 శాతం, టీవీఎస్ హోల్డింగ్స్ 4.14 శాతం, హ్యాపియస్ట్ మైండ్స్ 3.99 శాతం నష్టపోయాయి.