అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shekhar Kammula | జూన్ 20న శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర (Kubera) చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి గత కొద్ది రోజలుగా జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా శేఖర్ కమ్ముల ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాని – శేఖర్ కమ్ముల కాంబినేషన్(Nani – Shekhar Kammula combination)లో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న సంగతి సినీవర్గాలకు తెలిసిందే. కొంతకాలంగా ఈ కాంబోపై వార్తలు వస్తున్నప్పటికీ, ప్రాజెక్ట్ మొదలయ్యే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఇంకా టైమ్ పట్టేలా కనిపిస్తోంది.
Shekhar Kammula | వెయిటింగ్..
తాజాగా శేఖర్ కమ్ముల ఈ ప్రాజక్ట్ గురించి స్పందిస్తూ.. ప్రస్తుతం ఇది తొలి దశలోనే ఉందని, ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయని అన్నారు. ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ అయితే అఫీషియల్‌గా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు శేఖర్ కమ్ముల. దీంతో నాని- శేఖర్ కమ్ముల సినిమాకు సంబంధించి ఎప్పుడు పూర్తి క్లారిటీ ఇస్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో ‘దసరా’ ‘హాయ్ నాన్న’ ‘సరిపోదా శనివారం’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు నాని. ప్రస్తుతం ‘హిట్ 3: థర్డ్ కేస్’ మూవీలో నటించారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అనౌన్స్ చేసిన సుజీత్ ప్రాజెక్ట్ సెట్స్(Sujeeth project sets) మీదకు వెళ్లాల్సి ఉంది. తమిళ దర్శకుడు శిబి చక్రవర్తితో ఓ సినిమా చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
నానికి (Nani) ఇప్పటికే 2026కి సంబంధించి రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. దీంతో శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ కోసం ఒకేసారి ఎక్కువ డేట్స్ ఇవ్వడం కష్టమని, ప్రతినెలా పదిరోజుల చొప్పున డేట్స్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ సినిమా షూటింగ్‌కు టైమ్ పట్టే అవకాశం ఉంది. అయినా, ఈ కాంబోపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి పద్ధతిలోనైనా సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆసియన్ సునీల్ నిర్మించబోతున్నాడు. ‘లవ్ స్టోరీ’, ‘ఫిదా’ తరహాలో శేఖర్ కమ్ముల తన స్టైల్లో తీసే సెన్సిబుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. అందుకే నిర్మాణంలో ఖర్చుకు వెనుకాడకుండా మంచి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమా తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఉన్నారని సమాచారం.