More
    HomeసినిమాChiranjeevi | డ్రిల్ మాస్ట‌ర్‌గా చిరంజీవి.. ముస్సోలిలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ‌

    Chiranjeevi | డ్రిల్ మాస్ట‌ర్‌గా చిరంజీవి.. ముస్సోలిలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Chiranjeevi | సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ ఏడాది సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రంతో పెద్ద హిట్ కొట్టారు. ఇప్పుడు అదే జోష్‌తో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు తీసిన 8 సినిమాలు సక్సెస్ అందుకోగా, ఇప్పుడు ఈ చిత్రం కూడా హిట్ అంటున్నారు. అనిల్ రావిపూడి ఆడియన్స్ పల్స్ పట్టేశాడని చెప్పొచ్చు. స్టార్ ఇమేజ్ ని బట్టి ఆ స్టార్ నుంచి ఫ్యాన్స్ ఆశించే అంశాలు ఇస్తూనే తన మార్క్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు అనిల్ రావిపూడి.

    Chiranjeevi | న‌వ్వాపుకోలేరు..

    చిరంజీవి(Chiranjeevi)లోని కామెడీ యాంగిల్ కూడా అదిరిపోతుంది. ఆయన టైమింగ్ ని పట్టుకోవాలే కానీ మూములుగా ఉండ‌దు. అనిల్ చిరులోని ఆ టైమింగ్ ని పట్టుకుని మెగా 157 సినిమా(Mega 157 movie)ను చేస్తున్నారట. యాక్షన్ ని కూడా మిక్స్ చేస్తున్నాడట. అనిల్ మార్క్ కామెడీ ట్రాక్ చూసి థియేటర్లో ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుతారని అంటున్నారు. స్క్రిప్ట్ దశలోనే ఇది సూపర్ గా వర్క్ అవుట్ అవుతుందని అనిపిస్తుండగా.. రష్ చూస్తే ఇక అందరు నవ్వు ఆపులేకపోతారని అంటున్నారు.. మొత్తానికి మెగా 157 క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరినీ కవర్ చేసేలా ఉంటుందని చెప్పుకుంటున్నారు. చిరుతో సినిమాను అనుకున్న టైంకి పూర్తి చేసి రిలీజ్ టార్గెట్ ని కూడా సక్సెస్ ఫుల్ గా అందుకోవాలని చూస్తున్నాడు అనిల్ రావిపూడి.

    READ ALSO  Kubera Trailer | కుబేర ట్రైలర్ అంచ‌నాలు పెంచిందా.. రాజ‌మౌళి రియాక్ష‌న్ ఏంటి?

    మెగా 157 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమా.. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్ర‌స్తుతం ముస్సోలిలో స్కూల్ నేప‌థ్యంలోని కొన్ని సీన్స్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు నయనతార (Heroine Nayanthara), కేథ‌రిన్ థ్రెసా (Catherine Tresa) కూడా పాల్గొంటున్నారు.

    ఈ స్కూల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో వస్తోందని, అవుట్ పుట్ పట్ల మూవీ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉందని వినికిడి. చిరంజీవి అసలు పేరు శివ శంకర్‌ వరప్రసాద్ కాగా, అదే పేరుతో ఈ సినిమాలో కనిపించనున్నారు. డ్రిల్ మాస్ట‌ర్ శివ శంకర్‌ వరప్రసాద్‌ గా సందడి చేయనున్నారు. స్కూల్ నేప‌థ్యంలో వచ్చే కామెడీ సీన్స్ అదిరిపోతాయని, చిరు కామెడీకి థియేటర్లలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ఖాయమని అంటున్నారు.

    READ ALSO  Actress Kalpika | ప్రిజం పబ్​ ఘటన.. నటి కల్పికకు షాకిచ్చిన పోలీసులు

    Latest articles

    Gadwal | రైతులకు బేడీలు.. పోలీసులపై సస్పెన్షన్​ వేటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Gadwal | రైతులకు బేడీలు వేయడంపై ప్రభుత్వం సీరియస్​ అయింది. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు...

    CM Revanth | బీఆర్​ఎస్​ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (AP Govt) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project)...

    Melody | సోషల్ మీడియాలో మళ్లీ ‘మెలోడీ’.. మోదీ, మెలోని సంభాషణ వీడియో వైరల్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Melody | కెనడాలో (Canada) జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,...

    Khamenei | తలొగ్గేదే లేదు.. ఇరాన్ సుప్రీం ఖమేనీ స్పష్టీకరణ

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Khamenei | తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel Attack) తప్పు చేసిందని, అందుకు...

    More like this

    Gadwal | రైతులకు బేడీలు.. పోలీసులపై సస్పెన్షన్​ వేటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Gadwal | రైతులకు బేడీలు వేయడంపై ప్రభుత్వం సీరియస్​ అయింది. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు...

    CM Revanth | బీఆర్​ఎస్​ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (AP Govt) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project)...

    Melody | సోషల్ మీడియాలో మళ్లీ ‘మెలోడీ’.. మోదీ, మెలోని సంభాషణ వీడియో వైరల్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Melody | కెనడాలో (Canada) జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,...