More
    HomeజాతీయంWine Shop | వైన్ షాప్​లో చోరీ.. దొంగ లోపలికి ఎలా దూరాడో చూస్తే షాకవుతారు.....

    Wine Shop | వైన్ షాప్​లో చోరీ.. దొంగ లోపలికి ఎలా దూరాడో చూస్తే షాకవుతారు.. వీడియో వైరల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Wine Shop | వైన్ షాప్ తలుపులు మూసి ఉన్నాయి. తాళం సరిగ్గా వేసి ఉంది. పైకప్పుస‌రిగ్గానే ఉంది. చుట్టూ పటిష్టమైన భ‌ద్రత ఉంది. అయినా దుకాణంలో ఉంచిన రూ.25,000 నగదు మాయమైంది. కాగా.. దొంగ చోరీకి పాల్పడిన వీడియోను చూస్తే నోరెళ్ల‌బెడ‌తారు. ఈ సంఘటన మహారాష్ట్ర(Maharashtra)లోని నాగ్‌పూర్ పట్టణంలో చోటుచేసుకుంది. నగరంలోని ఓ వైన్ షాప్‌లో రాత్రి సమయంలో చిన్న కౌంటర్ గ్రిల్ రంధ్రం(Counter grill hole) నుంచి దొంగ తల దూర్చి, తన శరీరాన్ని తిప్పుతూ, అచ్చం సూపర్ హీరోలా ఆ లోపలికి చొరబడ్డాడు.

    Wine Shop | కౌంట‌ర్ గ్రిల్ నుండి..

    వైన్​ షాప్​ లోపలికి ప్రవేశించిన దొంగ దుకాణంలోని కౌంటర్ నుంచి రూ.25,000 నగదును తీసుకొని అదే రంధ్రం ద్వారా మళ్లీ బయటకు వచ్చాడు. ఇవన్నీ కేవలం కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్(CCTV Footage) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఈ దొంగ చాలా స్మార్ట్ గురూ అని కామెంట్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు డొరేమాన్ కార్టూన్ స్టైల్‌లో చేశాడ‌ని, ఇంకొంద‌రు ఇతనిని ఢిల్లీ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించాలి అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.

    READ ALSO  Dog Bite | ఇండియాలోనే అత్య‌ధికంగా కుక్క‌ల బెడ‌ద‌.. నిమిషానికి 6 కుక్క‌కాటు కేసులు

    దుకాణ యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. షాపు యజమాని ప్రతి రోజు మాదిరిగానే రాత్రి షాప్‌ను మూసి, తాళం వేసి వెళ్లిపోయాడు. కానీ ఆ రోజు ఉదయం వచ్చి చూసేసరికి నగదు మాయమైపోయింది. స్థానిక పోలీసులు(Maharashtra Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటన సాధారణ తాళాలు, గేట్లతో సరిపెట్టుకున్నా సురక్షితం కాదన్నదానికి నిదర్శనంగా మారింది. చిన్న రంధ్రాల నుంచి కూడా దొంగలు లోపలికి చొరబడుతున్న సందర్భాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దుకాణాలు కలిగి ఉన్నవారు మరింత అధునాతన భద్రతా పద్ధతులు అవలంబించాలని పోలీసులు సూచిస్తున్నారు.

    Latest articles

    Gadwal | రైతులకు బేడీలు.. పోలీసులపై సస్పెన్షన్​ వేటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Gadwal | రైతులకు బేడీలు వేయడంపై ప్రభుత్వం సీరియస్​ అయింది. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు...

    CM Revanth | బీఆర్​ఎస్​ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (AP Govt) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project)...

    Melody | సోషల్ మీడియాలో మళ్లీ ‘మెలోడీ’.. మోదీ, మెలోని సంభాషణ వీడియో వైరల్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Melody | కెనడాలో (Canada) జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,...

    Khamenei | తలొగ్గేదే లేదు.. ఇరాన్ సుప్రీం ఖమేనీ స్పష్టీకరణ

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Khamenei | తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel Attack) తప్పు చేసిందని, అందుకు...

    More like this