అక్షరటుడే, బాన్సువాడ: Collector Ashish Sangwan | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఏడాదిలోగా పూర్తవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బాన్సువాడ (banswada) పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఇందిరమ్మ ఇంటి (Indiramma illu) నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనల మేరకే ఇళ్లు నిర్మించాలని లబ్ధిదారులకు సూచించారు.
విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్నారు. అనంతరం పాత బాన్సువాడలోని సహకార సంఘం చౌక ధరల దుకాణంలో సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు (Municipal Commissioner Srihari Raju), డీఎల్పీవో సత్యనారాయణ రెడ్డి, తహశీల్దార్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.