More
    HomeజాతీయంPost Office scheme | ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కన్నా ఎక్కువ వడ్డీ కావాలా.. అయితే పోస్టాఫీస్‌...

    Post Office scheme | ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కన్నా ఎక్కువ వడ్డీ కావాలా.. అయితే పోస్టాఫీస్‌ స్కీం ఉందిగా..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Post Office scheme : సురక్షిత ఆదాయం కోసం చాలామంది బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(Fixed deposits)లో పెట్టుబడి పెడుతుంటారు. అయితే ఎఫ్‌డీ కన్నా ఎక్కువ వడ్డీని పోస్టాఫీసు(Post office)లు అందిస్తాయని చాలామందికి తెలియదు. కాస్త ఎక్కువ వడ్డీ కావాలనుకునేవారికి పోస్ట్‌ ఆఫీస్‌ టైం డిపాజిట్‌ అకౌంట్‌(Time deposit account) ఉత్తమ ఎంపిక అవుతుంది. ఇది భారత పోస్టల్‌ సర్వీసెస్‌ అందించే సురక్షితమైన పెట్టుబడి పథకం. ప్రభుత్వ గ్యారంటీతో కూడిన పెట్టుబడి కాబట్టి ఎలాంటి రిస్క్‌(No risk) ఉండదు. రాబడికి గ్యారంటీ ఉంటుంది. అవసరమైనప్పుడు లోన్‌ సౌకర్యం కూడా వినియోగించుకోవచ్చు. ఈ స్కీం వివరాలు తెలుసుకుందామా..

    Post Office scheme : పోస్ట్‌ ఆఫీస్‌ టైం డిపాజిట్‌ అకౌంట్‌ వివరాలు..

    దీనిని నేషనల్‌ సేవింగ్స్‌ టైం డిపాజిట్‌ స్కీమ్‌(National savings time deposit scheme) అని కూడా పిలుస్తారు. ఇది 1, 2, 3, 5 ఏళ్ల వ్యవధితో ఉంటాయి. కనీస డిపాజిట్‌ వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. మూడు నెలలకోసారి వడ్డీ లెక్కిస్తారు. సంవత్సరానికోసారి వడ్డీ చెల్లిస్తారు. అకౌంట్‌ను ఒక పోస్ట్‌ ఆఫీస్‌ నుంచి మరొక దానికి బదిలీ చేసుకునే సౌకర్యమూ ఉంది.

    READ ALSO  Vijay Rupani | నేడు గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు

    Post Office scheme : వడ్డీ రేట్లు..

    ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు ఏడాది కాలపరిమితిగల డిపాజిట్లకు 6.9 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. రెండేళ్లకు 7 శాతం, మూడేళ్లకు 7.1 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ అందుతుంది. వడ్డీ రేట్ల(Interest rate)ను ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తుంది. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా వడ్డీ రేట్లలో మార్పు ఉండవచ్చు.

    Post Office scheme : ఎవరు అర్హులంటే..

    భారత దేశ పౌరులు అర్హులు. వ్యక్తిగతంగా(Individual) లేదా జాయింట్‌గా, గరిష్టంగా ముగ్గురు కలిసి కూడా అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసుగల మైనర్లు(స్వతంత్రంగా లేదా గార్డియన్‌ ద్వారా), గార్డియన్‌ తరఫున మైనర్‌ లేదా మానసికంగా అస్థిరమైన వ్యక్తి కోసం అకౌంట్‌ తెరవవచ్చు. నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌(NRI), ట్రస్ట్‌లు, సంస్థలు లేదా ఇతర సంస్థలు ఈ పథకానికి అర్హులు కాదు.

    READ ALSO  Maharashtra | వృద్ధుడి పంచన చేరింది.. సపర్యలు చేసింది.. ఆస్తి రాయించుకుని దారుణంగా బయటకు గెంటేసింది..

    Post Office scheme : నామినేషన్‌ సౌకర్యం..

    అకౌంట్‌ తెరిచే సమయంలో లేదా తర్వాత నామినీని నియమించవచ్చు. మెచ్యూరిటీ మరియు ఆటో రెన్యువల్‌, మెచ్యూరిటీ(Maturity) తర్వాత అకౌంట్‌ ఆటోమేటిక్‌గా అదే వ్యవధికి రెన్యువల్‌ అవుతుంది. మెచ్యూరిటీ తీరకముందే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఖాతా తెరిచిన ఆరు నెలల తర్వాత మాత్రమే రద్దుకు అనుమతి ఇస్తారు. 6-12 నెలల మధ్య విత్‌డ్రాయల్‌ విషయంలో పోస్ట్‌ ఆఫీస్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ వడ్డీ రేటు (4 శాతం పర్‌ ఆనమ్‌) వర్తిస్తుంది.

    ఖాతా తెరవడం ఎలా.. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌ ద్వారా కూడా డిపాజిట్‌ అకౌంట్‌ తెరవవచ్చు. ఆఫ్‌లైన్‌లో ఖాతా తెరవాలనుకునేవారు సమీపంలోని పోస్ట్‌ ఆఫీస్‌ను సంప్రదిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లోనూ ఖాతా తెరవవచ్చు. పోస్ట్‌ ఆఫీస్‌ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం ఉన్నవారు ఇండియా పోస్ట్‌ ఇ-బ్యాంకింగ్‌(India post e-banking) పోర్టల్‌లో లాగిన్‌ అవ్వాలి. జనరల్‌ నర్వీసెస్‌ కింద సర్వీస్‌ రిక్వెస్ట్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. న్యూ రిక్వెస్ట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి దరఖాస్తును పూరించాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేస్తే సరి.

    READ ALSO  Ahmedabad Plane Crash | విమాన ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

    Latest articles

    CM Revanth | బీఆర్​ఎస్​ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (AP Govt) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project)...

    Melody | సోషల్ మీడియాలో మళ్లీ ‘మెలోడీ’.. వైరల్ అవుతున్న మోదీ, మెలోని ఫొటో

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Melody | కెనడాలో (Canada) జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర...

    Khamenei | తలొగ్గేదే లేదు.. ఇరాన్ సుప్రీం ఖమేనీ స్పష్టీకరణ

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Khamenei | తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel Attack) తప్పు చేసిందని, అందుకు...

    Formula E race case | ఏసీబీకి సెల్​ఫోన్లు ఇవ్వని కేటీఆర్​..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E race case | ఫార్ములా– ఈ కారు రేస్ కేసు (Formula...

    More like this

    CM Revanth | బీఆర్​ఎస్​ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (AP Govt) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project)...

    Melody | సోషల్ మీడియాలో మళ్లీ ‘మెలోడీ’.. వైరల్ అవుతున్న మోదీ, మెలోని ఫొటో

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Melody | కెనడాలో (Canada) జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర...

    Khamenei | తలొగ్గేదే లేదు.. ఇరాన్ సుప్రీం ఖమేనీ స్పష్టీకరణ

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Khamenei | తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel Attack) తప్పు చేసిందని, అందుకు...