అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre Market analysis : ప్రధాన గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో యూఎస్, యూరోప్ మార్కెట్లు నష్టాలతో ముగియగా ఉండగా.. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి.
Pre Market analysis : యూఎస్ మార్కెట్లు(US markets)..
అమెరికా మార్కెట్లు మంగళవారం నెగెటివ్‌్‌గా ముగిశాయి. నాస్‌డాక్(Nasdaq) 0.91 శాతం, ఎస్‌అండ్‌పీ 0.84 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ స్వల్ప లాభాలతో సాగుతోంది.
Pre Market analysis : యూరోప్ మార్కెట్లు(European markets)..
యూరోప్ మార్కెట్లు సైతం నష్టాలతో ముగిశాయి. డీఏఎక్స్(DAX) 1.13 శాతం, సీఏసీ 0.76 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.47 శాతం నష్టపోయాయి.
Pre Market analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..
ఆసియా మార్కెట్లు బుధవారం ఉదయం మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో కోస్పీ(Kospi) 0.68 శాతం, నిక్కీ 0.59 శాతం లాభాలతో ఉండగా.. హంగ్‌సెంగ్ 1.15 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.37 శాతం, షాంఘై 0.32 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.07 శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.13 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Pre Market analysis : గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 1,482 కోట్లు, డీఐఐలు రూ. 8,207 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.14 నుంచి 0.95 కు తగ్గింది. విక్స్(VIX) 2.93 శాతం తగ్గి 14.40 వద్ద ఉంది. ఇది మార్కెట్లలో నిలకడను, బుల్లిష్ సెంటిమెంట్‌ను సూచిస్తోంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.12 శాతం తగ్గి 76.36 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పడిపోయి 86.24 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.09 శాతం తగ్గి 98.73 వద్ద ఉండగా.. యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 0.30 శాతం తగ్గి 4.40 వద్ద నిలిచింది.
- అమెరికాకు చెందిన ఫెడ్(Fed) మీటింగ్ మినిట్స్ కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు.
అమెరికా సైన్యం మధ్యప్రాచ్యానికి(Middle east) యుద్ధ విమానాలను తరలించడంతో ఇజ్రాయిల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. దీంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు నష్టపోయాయి. ఈ పరిణామాలను ఆసియా మార్కెట్లు(Asian markets) నిశితంగా పరిశీలిస్తున్నాయి.