More
    HomeజాతీయంPahalgam | పహల్గావ్.. హిందువులకు ఎంత పవిత్ర స్థలమో తెలుసా..!

    Pahalgam | పహల్గావ్.. హిందువులకు ఎంత పవిత్ర స్థలమో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pahalgam : పహల్గావ్​లోని మామలేశ్వర్ ఆలయం mayaleshwar temple కశ్మీర్ లోయలోని పురాతన ఆలయాలలో ఒకటి. కొంతమంది చరిత్రకారులు historical దీనిని 12వ శతాబ్దంలో రాజా జయసింహ నిర్మించారని చెబుతారు. ఈ ఆలయానికి చారిత్రక, మతపరమైన ప్రాధాన్యం ఉంది.

    మామలేశ్వర్ ఆలయంలో ఒక పీఠంతో పాటుగా శివ లింగం ఒక నీటి బుగ్గలో కవర్ చేయబడి ఉంటుంది. ఈ లింగానికి దైవిక శక్తి ఉందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక ఆలయం చుట్టూ ఉన్న సహజ సౌందర్యం భక్తులకు శాంతిని, ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుంది. ఈ ఆలయంలో ఉండే రెండు ముఖాల నంది విగ్రహం ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు.

    Pahalgam : పౌరాణిక గాథ ప్రకారం..

    పార్వతి దేవి స్నానానికి వెళ్తూ నలుగు పిండితో బొమ్మ తయారు చేసి ప్రాణం పోస్తుంది. ఆ బాలుడిని ద్వారపాలకుడిగా నియమించి, లోపలికి ఎవరూ ప్రవేశించకుండా చూడమని చెబుతుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పరమేశ్వరుడిని లోపలకు వెళ్లకుండా ఆ బాలుడు అడ్డుకుంటాడు.

    ముద్దులొలికే బాలుడిని శివుడు ముచ్చట పడినా.. ద్వారానికి అడ్డుతొలగకపోవడంపై కోపోద్రిక్తుడవుతాడు. చివరికి ఆ బాలుడి శిరస్సును పరమేశ్వరుడు ఖండిస్తాడు. చివరికి విషయం తెలుసుకుని, ఏనుగు తలను ఆ బాలుడికి అతికిస్తాడు. అలా ఏనుగు తలను అతికించిన ప్రదేశం ఇదే అనేది పురాణ గాథ.

    Pahalgam : మరో కథనం ఏంటంటే..

    పార్వతీ దేవి ఇక్కడే శివుని కోసం తపస్సు చేసినట్లు చెబుతారు. అందువల్ల ఈ ఆలయాన్ని వివాహం, ప్రేమ, భక్తి కలగలిపిన ప్రదేశంగా భావిస్తారు. మామలేశ్వర్ ఆలయం గురించి కల్హణుడు రాసిన రాజతరంగిణిలో ప్రస్తావించబడింది. ఈ ప్రదేశం మునులు, ఋషులు, సాధకులు, ధ్యానం చేసే వారికి.. దైవిక, శక్తివంతమైన ప్రదేశంగా చెబుతుంటారు.

    Pahalgam : అమర్‌నాథ్ యాత్ర ప్రధాన స్టేషన్

    అమర్‌నాథ్ యాత్ర amarnath పహల్గావ్​ నుంచే ప్రారంభమవుతుంది. శివ భక్తులు అమర్‌నాథ్‌కు వెళ్లే ముందు మామలేశ్వర్ ఆలయంలో శివయ్యని దర్శనం చేసుకుని తమ ప్రయాణాన్ని మొదలు పెట్టడం శుభప్రదం అని భావిస్తారు.

    Pahalgam : ఎన్నో ప్రత్యేకతల సమాహారం

    లిడ్డర్ నది lidder river పహల్గావ్​ లోని ప్రశాంతమైన, సుందరమైన లోయలో మామలేశ్వర్ ఆలయం ఉంది. సహజ సౌందర్యం, ఆధ్యాత్మిక శక్తి కలిసే ఈ ప్రదేశం ధ్యానం, సాధన , స్వీయ శుద్ధికి అనువైనదిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కశ్మీర్ శైలిలో పురాతన రాతితో నిర్మించారు. అందమైన రాతి శిల్పాలతో కూడిన జల్ కుండ్ (పవిత్ర జలం) పవిత్రమైనదిగా భావిస్తారు. మహా శివరాత్రి, శ్రావణ మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు ఉంటాయి. రాత్రి జాగరణ, అన్న ప్రసాద వితరణ వంటివి నిర్వహిస్తారు.

    Latest articles

    Gandhari Police | విద్యుత్​షాక్​తో ఒకరికి గాయాలు.. స్పందించిన పోలీసులు

    అక్షరటుడే,గాంధారి:Gandhari Police | విద్యుత్​షాక్​(Electric Shock)తో ఒకరికి గాయాలు కాగా.. బ్లూకోల్ట్​ సిబ్బంది(Blue Colt staff) స్పందించి అతడి...

    MIB | సరిహద్దులో ఉద్రిక్తతలు.. మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MIB | పహల్​గామ్​ ఉగ్రదాడి(Pahalgam terrorist attack) నేపథ్యంలో భారత్​ ‌‌– పాకిస్తాన్​ మధ్య తీవ్ర...

    Bhubharati | భూభారతితో అప్పీల్‌కు అవకాశం

    అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం:Bhubharati | భూభారతి చట్టంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌(Collector Ashish Sangwan)...

    Rahul Gandhi | రాజకీయాలపై రాహుల్​గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rahul Gandhi | దేశంలోని ప్రస్తుత రాజకీయాలపై ఏఐసీసీ అగ్రనేత AICC Leader రాహుల్ గాంధీ...

    More like this

    Gandhari Police | విద్యుత్​షాక్​తో ఒకరికి గాయాలు.. స్పందించిన పోలీసులు

    అక్షరటుడే,గాంధారి:Gandhari Police | విద్యుత్​షాక్​(Electric Shock)తో ఒకరికి గాయాలు కాగా.. బ్లూకోల్ట్​ సిబ్బంది(Blue Colt staff) స్పందించి అతడి...

    MIB | సరిహద్దులో ఉద్రిక్తతలు.. మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MIB | పహల్​గామ్​ ఉగ్రదాడి(Pahalgam terrorist attack) నేపథ్యంలో భారత్​ ‌‌– పాకిస్తాన్​ మధ్య తీవ్ర...

    Bhubharati | భూభారతితో అప్పీల్‌కు అవకాశం

    అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం:Bhubharati | భూభారతి చట్టంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌(Collector Ashish Sangwan)...
    Verified by MonsterInsights