అక్షరటుడే, ఇందూరు: bar and bench : న్యాయవ్యవస్థ సాఫీగా విధులు నిర్వహించడానికి బార్ అండ్ బెంచ్ రథ చక్రాల్లాంటివని నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి nizamabad district judge bharatha lskhmi పేర్కొన్నారు. జ్యూడిషియరీ సమానస్థాయిలో పయనించడానికి అదే స్థాయిలో రెండు చక్రాలు వెళ్ళినప్పుడు మాత్రమే న్యాయసేవలకు పరిపూర్ణత చేకూరుతుందన్నారు. న్యాయవ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచి ముందుకు నడిపించాల్సింది న్యాయవాదులేనని న్యాయమూర్తి పేర్కొన్నారు.
జిల్లాకోర్టు nizamabad district court ప్రాంగణంలోని పీపీ గంగారెడ్డి మెమోరియల్ హాల్ లో నిర్వహించిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ nizamabad bar association నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. జిల్లా కోర్టు అవసరాలకు అనుగుణంగా, వాహనాల రద్దీ, కక్షిదారుల రాకపోకల దృష్ట్యా మరింత ఖాళీ స్థలం కావలసిన అవసరం ఉన్నదని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మాట్లాడినట్లు తెలిపారు.
bar and bench : కోర్టు కోసం విద్యాశాఖ స్థలం..
బార్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి మాట్లాడుతూ.. కోర్టుల సంఖ్య పెరిగిందని. దాంతో పాటు మోటారు వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా జిల్లాకోర్టుకు ఆనుకుని ఉన్న విద్యాశాఖ స్థలాన్ని పరిశీలించాలని విన్నవించారు. నూతన బార్ కార్యవర్గానికి ఎల్లవేళలా తోడ్పాటును అందిస్తానని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి advocate rajendhar reddy తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు advocate Manik raj మాట్లాడుతూ.. బార్ అండ్ బెంచ్ కలిసికట్టుగా న్యాయసేవలు అందిద్దామని అన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జిలు శ్రీనివాస్, ఆశాలత, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బూ ఉపాధ్యాయ్, గోపికృష్ణ, శ్రీనివాసరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.