అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lamborghini Urus SE | సాధారణంగా సెలబ్రిటీలకు కార్లపై మోజు ఎక్కువగా ఉంటుంది. మార్కెట్‌లోకి కొత్త కారు వస్తే వెంటనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. కార్లకు లక్షలు ఖర్చు చేయడానికి కూడా వారు వెనకాడరు. తాజాగా ప్రముఖ టీవీ, బాలీవుడ్ నటుడు రామ్ కపూర్(Bollywood actor Ram Kapoor) తన కొత్త కారుతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఇటీవల, అతను కొత్త అల్ట్రా-హై-ఎండ్ లగ్జరీ హైబ్రిడ్ SUV “లాంబోర్గిని ఉరుస్”ను కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5.21 కోట్లుగా చెబుతున్నారు. ఈ మోడల్‌ను కొనుగోలు చేసిన మొదటి భారతీయుడిగా రామ్ కపూర్ రికార్డు సృష్టించాడు. అంటే.. భారతదేశంలోనే అత్యంత ధనవంతులైన అంబానీ, అదానీ దగ్గర కూడా ఇలాంటి కారు లేకపోవడం గమనార్హం.
Lamborghini Urus SE | విలాసవంతంగా..
అయితే తన కొత్త కారు లాంబోర్గిని ఉరుస్ SE దగ్గర తన భార్య గౌతమి కపూర్(Gautami Kapoor)తో కలిసి నిలబడి తీయించుకున్న ఫొటోను రామ్ కపూర్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేయడంతో ఈ పిక్ క్షణాలలో వైరల్ అయింది. ఈ కారు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ విలాసవంతమైన SUV కోసం రామ్ కపూర్ “వెర్డే జియా” (Verde Gea) అనే ప్రత్యేకమైన ఆకుపచ్చ పెయింట్ ఫినిషింగ్‌ను ఎంచుకున్నాడు. ఇది భారతీయ రోడ్లపై ఏ బండిపైనా కనిపించదు. కారు లోపలి భాగంలో బోల్డ్ ఆరెంజ్ కలర్ అసెంట్‌తో కూడిన స్లీక్ బ్లాక్ నలుపు థీమ్‌ను ఎంచుకున్నారు. ఈ లుక్ ప్రీమియం & పెర్ఫార్మెన్స్ పరిపూర్ణ కలయికను చూపిస్తుంది.
రామ్ కపూర్ కొత్త లాంబోర్గిని ఉరుస్ SE SUV 4.0L ట్విన్-టర్బోచార్జ్‌డ్ V8 ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 620 hp పవర్ & 800 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 25.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో యాడ్ అయ్యింది. మొత్తం అవుట్‌పుట్‌ను 800 hp & 950 Nmకి తీసుకువెళుతుంది. ఈ వాహనం సూపర్‌కార్ లాంటి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది, అదే సమయంలో SUVలో ఉండే సౌకర్యాన్ని & స్పేస్‌ను కూడా ఆస్వాదించవచ్చు. ఈ హై-ఎండ్ SUVలో అల్ట్రా ప్రీమియం అప్‌హోల్‌స్టెరీ, టచ్ స్క్రీన్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ అడ్జస్ట్‌మెంట్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్(Multi-zone climate control), 3D సౌండ్ సిస్టమ్ & సెన్స్-రెస్పాన్సివ్ డ్రైవింగ్ మోడ్స్ వంటి ఫ్యూచరిస్టిక్ ఫీచర్లు ఉన్నాయి. రామ్ కపూర్ దగ్గర హై-ఎండ్ కార్ కలెక్షన్ ఉంది. ఇప్పటికే Porsche 911 Carrera S, Mercedes-AMG G63, BMW X5 & Audi Q7 కార్లు ఆయన గ్యారేజ్‌లో ఉండగా, ఇప్పుడు కొత్త కారు చేరింది.