More
    HomeజాతీయంKerala | పూజల పేరుతో మహిళను బెదిరించి.. లైంగిక దాడికి పాల్పడి..

    Kerala | పూజల పేరుతో మహిళను బెదిరించి.. లైంగిక దాడికి పాల్పడి..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kerala : పూజల పేరుతో మహిళను లైంగికంగా లోబర్చుకున్న ఘటన కేరళలో జరిగింది. బెంగళూరు(Bengaluru)కు చెందిన మహిళపై లైంగిక దాడికి పాల్పడడంతో కేరళ ఆలయ పూజారి సహాయకుడిని సోమవారం బెల్లందూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు త్రిస్సూర్‌లోని శ్రీ విష్ణుమయ స్వామి ఆలయంలో పూజారి సహాయకుడిగా పనిచేసిన అరుణ్ గా గుర్తించారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు(Bengaluru)కు చెందిన ఓ మహిళ(38) జీవన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ కేరళలోని ఓ ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లింది. అక్కడ పూజారి సహాయకుడు అరుణ్ ఆమెపై కన్నేశాడు. ఆమె కుటుంబంపై చేతబడి జరిగిందని, పూజలు చేస్తే సమస్యలు తొలగిపోతాయని నమ్మించాడు. పూజలు కఠినంగా ఉంటాయని ఆ మహిళను ఒప్పించాడు.

    అనంతరం మహిళ ఒంటిపై నూలు పోగు లేకుండా చేసి పూజలో పాల్గొనేలా చేశాడు. విపరీత భయానికి గురైన ఆ మహిళ పూజలు అయిపోయాక ఇంటికి తిరిగి వెళ్లింది. ఇంటికి వెళ్లిన మహిళను అరుణ్ మళ్లీ రావాలని బలవంతం చేశాడు. మహిళ బట్టలు లేకుండా పూజలో పాల్గొన్న వీడియోలు, ఫొటోలు తన వద్ద ఉన్నాయని బెదిరించాడు.

    READ ALSO  plane crash | అంతర్జాతీయ ఇష్యూగా మారిన ఫ్లైట్​ క్రాష్..​ గుజరాత్​కు యూకే దర్యాప్తు బృందం

    బాధితురాలు కేరళ వెళ్లాక ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె వద్ద నుంచి డబ్బులు లాగేసుకుని, తాను ఎప్పుడు చెబితే అప్పుడు రావాలని బెదిరించాడు. దీంతో బాధితురాలు బెంగళూరుకు చేరుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

    Latest articles

    Nizamabad | జిల్లా కోర్టు సంచలన తీర్పు.. వీడీసీ సభ్యులకు ఐదేళ్ల జైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad | జిల్లా కోర్టు (District Court) మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీ...

    Asim Munir | పాక్ ఆర్మీ చీఫ్ మునీర్​కు భంగపాటు.. అగ్రరాజ్యంలో పాక్ పౌరుల నుంచే నిరసన

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Asim Munir | అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీమ్...

    Kamareddy SP | నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SP | జిల్లాలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రాజేష్‌...

    KGF | 8 దశాబ్దాల తర్వాత కేజీఎఫ్ పునరుద్ధరణ.. తగ్గనున్న బంగారం దిగుమతులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: KGF | కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(Karnataka Kolar Gold Fields) మళ్లీ తెరుచుకోనుంది. దాదాపు...

    More like this