More
    Homeఅంతర్జాతీయంJapan | జ‌పాన్‌లో 90 ల‌క్ష‌ల ఇళ్లు ఖాళీ.. వీళ్లంతా ఎటు పోయిన‌ట్టు..!

    Japan | జ‌పాన్‌లో 90 ల‌క్ష‌ల ఇళ్లు ఖాళీ.. వీళ్లంతా ఎటు పోయిన‌ట్టు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Japan | ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న జపాన్‌లో (Japan) కొత్త సమస్య వచ్చిపడింది. ఆ దేశంలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఇది సమస్య ఎలా అవుతుందని ఆలోచిస్తున్నారా? తక్కువ జనన రేటుతో (birth rate) ఇప్పటికే జపాన్‌లో జనాభా (Japan population) తగ్గిపోతోంది. దేశంలో ఉన్న జనాభా కూడా ఇతర దేశాలకు వలస వెళ్లిపోతుండడంతో అక్కడ ఇళ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి విపత్తుల దృష్ట్యా జనాలు వీటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అభివృద్ధిలో మనకంటే ఎంతో ముందుండే జపాన్‌లో వృద్ధుల సంఖ్య కూడా అధికం.

    Japan | ఎందుకు అలా..

    అదిగాక వారి జీవనకాలమూ ఎక్కువే. కెరీర్‌లో పడి పిల్లలను కనకపోవటం వల్ల సదరు ఇంటివాళ్లు చనిపోతే ఆ ఇల్లు అనాథే. పిల్లలు ఇతర నగరాలకు, దేశాలకు వెళ్లిపోవటం వల్ల కూడా ఈ సమస్య ఉంది. ఇకపోతే జపాన్‌లో పన్నుల భారం వల్ల పాత ఇంటిని పునరుద్ధరించటం కన్నా కొత్త ఇల్లు (New House) కట్టుకోవటమే మేలు అనుకుంటారు. అందుకే కొన్ని ఇళ్లకు యజమానులు ఎవరో కూడా తెలియదట. అంటే ప్రభుత్వం యజమానుల వివరాలను రికార్డు చేయలేదు. పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టుకు (public transport) ఆ ఇళ్లు దూరంగా ఉండటం లాంటి కారణాల వల్ల జపాన్‌ పల్లెల్లో గత ఇరవై ఏళ్ల నుంచి ఇలాంటి ఇళ్ల సంఖ్య పెరిగిపోయింది.

    READ ALSO  PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని మోదీ.. 15 నుంచి మూడు దేశాల పర్యటన

    ఇప్పటిదాకా సుమారు 30 లక్షల మంది విదేశీయులు (3 million foreigners) జపాన్‌లోని ఈ పల్లెలను సందర్శించారట. ప్రస్తుతం ఇదోరకం టూరిజంలా మారింది. వాస్తవానికి ఇక్కడ ఇల్లు కొంటే తర్వాత అమ్మడం కూడా కష్టం. అందువల్లే ఈ సమస్య అంటున్నారు స్థానిక బిల్డర్లు. హషిమా ఐల్యాండ్‌, టోక్యోకు దగ్గరగా ఉండే కిజోజీ, నారా డ్రీమ్‌ ల్యాండ్‌, ర్యాబిట్‌ ఐల్యాండ్‌, కవాగుచి సిటీ.. లాంటి ప్రాంతాల్లో ఖాళీ ఇళ్లు (Empty houses) ఎక్కువగా కనిపిస్తాయి. రోజు రోజుకూ అక్కడ జనాభా తగ్గిపోతుంది. అలానే జపాన్‌లో రికార్డుస్థాయిలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య 9 మిలియన్లకు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఖాళీ ఇళ్లను ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ పోతే ప్రపంచ ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో నగర జనాభాకు సరిపోతాయి. అక్కడ ఇలా ఖాళీగా వదిలేసిన ఇళ్లను ‘అకియా’ అంటారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో దూరంగా నివాసాలను కూడా ఈ పేరుతోనే పిలిచేవారు.

    READ ALSO  Artificial Blood | స‌రికొత్త టెక్నాల‌జీ కనిపెట్టిన జ‌పాన్.. వైద్యానికి ర‌క్తంతో పని లేదు..!

    Latest articles

    Minister Vivek Venkata Swamy | మంత్రిని కలిసిన అంబేడ్కర్​ సంఘం నాయకులు

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Vivek Venkata Swamy | రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, మైనింగ్ శాఖ మంత్రి...

    Uttar Pradesh | నోయిడాలో బైక్‌పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ల‌వ‌ర్స్.. ఏంటి ఈ దారుణం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttar Pradesh | ఈ మధ్య కాలంలో ప్రేమికుల (Lovers) ఆగ‌డాలు చాలా ఎక్కువైపోతున్నాయి....

    Kubera Trailer | కుబేర ట్రైలర్ అంచ‌నాలు పెంచిందా.. రాజ‌మౌళి రియాక్ష‌న్ ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kubera Trailer | నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక మందన్న (Rashmika) ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెలుగు...

    IIT Hyderabad | ఐఐటీలో బోధన్ విద్యార్ధికి సీటు

    అక్షరటుడే,బోధన్: IIT Hyderabad | పట్టణానికి చెందిన విద్యార్థి ఐఐటీ హైదరాబాద్​లో సీటు సాధించాడు. శక్కర్​నగర్​కు చెందిన కారం...

    More like this