More
    HomeతెలంగాణHyderabad | మందుబాబుల‌కి శుభ‌వార్త‌.. కొత్త బార్స్ వచ్చేశాయ్..

    Hyderabad | మందుబాబుల‌కి శుభ‌వార్త‌.. కొత్త బార్స్ వచ్చేశాయ్..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆహ్వానించిన బార్ లైసెన్స్ (Bar License) దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో (Greater Hyderabad area) 24 కొత్త బార్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇది ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (GHMC) పరిధిలో చివరి రోజున దరఖాస్తులు అందించేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. 24 బార్లకు ఏకంగా 3,525 కు పైగా దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

    Bar License | గుడ్ న్యూస్..

    జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోని 24 బార్లతో పాటు మహబూబ్‌నగర్‌ (Mahabubnagar), నిజామాబాద్‌ (Nizamabad), బోధన్‌ (Bodhan), జల్‌పల్లి (సరూర్‌నగర్‌) మున్సిపాలిటీల పరిధిలో ఒక్కొక్క బార్‌ ఏర్పాటుకు గత నెలలో ఎక్సైజ్‌ శాఖ (Excise Department) దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత నెల 15న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ.. శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది. 24 కొత్త బార్ లైసెన్స్‌ల కోసం ఏకంగా 3,525 దరఖాస్తులు అందినట్లు జాయింట్ కమిషనర్ శాస్త్రి వెల్లడించారు. లక్కీ డ్రాలో బార్లు దక్కించుకున్న తమ నూతన బార్‌లను 90 రోజుల్లోగా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ గడువు పాటించకపోతే లైసెన్సులు రద్దు అయ్యే అవకాశం ఉంది.

    READ ALSO  Nizamsagar | సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి

    గ్రేటర్ హైదరాబాద్‌లోని (Greater Hyderabad) ఈ 24 బార్‌లు నగర నైట్‌లైఫ్‌కు, వినోద రంగానికి నూతన శోభను తీసుకువస్తాయి అని అంటున్నారు. ఇది పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా దోహదపడుతుంది. కొత్త వ్యాపారాలు (Merchants) ప్రారంభం కావడంతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎవరైనా సరే, నిర్దేశిత అర్హతలను కలిగి ఉంటే.. బార్ లైసెన్స్ (bar license) కోసం దరఖాస్తు చేసుకునే విధంగా ప్రక్రియను సరళీకరించారు. ఈ విధానం చిన్న, మధ్య స్థాయి పెట్టుబడిదారులకు కూడా అవకాశం కల్పించింది.

    Latest articles

    Yellamma temple | కోరట్ పల్లిలో ఘనంగా ఎల్లమ్మ పండగ

    అక్షర టుడే, డిచ్ పల్లి: Yellamma temple | మండలంలోని కొరట్ పల్లిలో ఆదివారం ఎల్లమ్మ ఆలయ రెండో...

    Nizamabad | గౌడ విద్యార్థులు చదువులో రాణించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | గౌడ విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని గౌడ అఫీషియల్స్,...

    Jukkal MLA | కాలువ మరమ్మతు పనుల పరిశీలన

    అక్షరటుడే, బిచ్కుంద : Jukkal MLA | జుక్కల్ మండలం పెద్ద ఎడిగి గ్రామంలో పెద్ద చెరువు ప్రధాన...

    korutla | కోరుట్లలో విషాదం.. కరెంట్​ షాక్​తో ఇద్దరి మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : korutla | జగిత్యాల జిల్లా (Jagtial district) కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. వినాయక...

    More like this

    Yellamma temple | కోరట్ పల్లిలో ఘనంగా ఎల్లమ్మ పండగ

    అక్షర టుడే, డిచ్ పల్లి: Yellamma temple | మండలంలోని కొరట్ పల్లిలో ఆదివారం ఎల్లమ్మ ఆలయ రెండో...

    Nizamabad | గౌడ విద్యార్థులు చదువులో రాణించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | గౌడ విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని గౌడ అఫీషియల్స్,...

    Jukkal MLA | కాలువ మరమ్మతు పనుల పరిశీలన

    అక్షరటుడే, బిచ్కుంద : Jukkal MLA | జుక్కల్ మండలం పెద్ద ఎడిగి గ్రామంలో పెద్ద చెరువు ప్రధాన...