అక్షరటుడే, కామారెడ్డి: De-Addiction Center | జిల్లాలో డిస్ట్రిక్ట్ డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం ఆసక్తి, అర్హత ఉన్న సంస్థల నుంచి ప్రతిపాదనలను స్వీకరించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ కార్యాచరణ ప్రణాళిక (NAPADDR) పథకం కింద సెంటర్ కోసం ప్రతిపాదించారని వివరించారు.
అర్హత, ఆసక్తి కలిగిన సంస్థలు ఈ-అనుధాన్ http://grants-msje.gov.in/ngo-login పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కలెక్టర్ కార్యాలయంలోని రూం.31లో ఉన్న జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో పనివేళల్లో సంప్రదించాలని సూచించారు. ఈనెల 30వరకు గడువు ఉందని పేర్కొన్నారు.