More
    Homeబిజినెస్​Stock Market | లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

    Stock Market | లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | అంతర్జాతీయంగా నెలకొని ఉన్న పాజిటివ్‌ సంకేతాలకు తోడు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) నూతన వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. దాదాపు అన్ని సెక్టార్ల స్టాక్స్‌(All sector stocks) లాభాల బాటలో పయనిస్తున్నాయి. సోమవారం ఉదయం 386 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో గరిష్టంగా 481 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా.. గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో స్వల్పంగా తగ్గింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 301 పాయింట్ల లాభంతో 82,490 5,109 వద్ద, నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 25,109 వద్ద కొనసాగుతున్నాయి. ఆర్‌బీఐ(RBI) అంచనాలకంటే ఎక్కువగా వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు సీఆర్‌ఆర్‌(CRR)ను వంద బేసిస్‌ పాయింట్లు తగ్గించడానికి చర్యలు తీసుకోవడంతో మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఆల్‌టైం గరిష్టాల వద్ద కొనసాగుతోంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, కొటక్‌, యాక్సిస్‌ బ్యాంకులు ఎక్కువగా లాభపడ్డాయి.

    READ ALSO  Stock Market | ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్లు

    Stock Market | రాణిస్తున్న అన్ని రంగాలు..

    అన్ని ప్రధాన రంగాల షేర్ రాణిస్తున్నాయి. బీఎస్‌ఈ(BSE) పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.71 శాతం పెరగ్గా.. ఇన్‌ఫ్రా 1.31 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.02 శాతం పెరిగాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌, ఎనర్జీ, మెటల్‌ ఇండెక్స్‌లు సుమారు ఒక శాతం లాభంతో కొనసాగుతున్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌(Small cap index) 1.31 శాతం, మిడ్‌ క్యాప్‌ 0.97 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.58 శాతం లాభాలతో ఉన్నాయి.

    Stock Market | Top Gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 23 స్టాక్స్‌ లాభాలతో, 7 స్టాక్స్‌ నష్టాలతో కొనసాగుతున్నాయి. కొటక్‌ బ్యాంక్‌(Kotak bank) 3.03 శాతం పెరగ్గా.. బజాజ్‌ ఫైనాన్స్‌(Bajaj finance) 2.97 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.98 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.82 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1.74 శాతం, టీసీఎస్‌ 1.04 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.

    READ ALSO  Stock Markets | స్టాక్‌ మార్కెట్లలో లాభాలకు బ్రేక్.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

    Stock Market | Top losers..

    ఐసీఐసీఐ బ్యాంక్‌(ICICI bank) 1.33 శాతం పడిపోయింది. టైటాన్‌ 0.82 శాతం, ఎంఅండ్‌ఎం 0.42 శాతం, నెస్లే 0.41 శాతం, మారుతి 0.55 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this