అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన కామారెడ్డి మండలం(Kamareddy mandal) చిన్నమల్లారెడ్డి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మదాం సంజీవ్(34) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన సంజీవ్ శుక్రవారం ఎలుకల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి (GGH kamareddy) జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సంజీవ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.