అక్షరటుడే, వెబ్‌డెస్క్:Fake Certificates | గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) సిటీలో భారీగా నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. అధికారులు డబ్బులు తీసుకొని ఎవరికి పడితే వారికి సర్టిఫికెట్లు ఇచ్చారు.
ఇప్పటికే హైదరాబాద్లో పాక్(Pakistan), బంగ్లాదేశ్(Bangladesh) నుంచి వచ్చి పలువురు అక్రమంగా నివసిస్తున్నారు. అంతేగాకుండా వారు ఇక్కడ ఆధార్, ఓటర్ కార్డులు తీసుకోవడం గమనార్హం. కొందరు అధికారులు డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇస్తుండటంతో అక్రమ వలసదారులు సైతం దర్జాగా ఆధార్ కార్డు (Aadhar Card) తీసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
నార్సింగి పోలీస్ స్టేషన్ (Narsingi Police Station) పరిధిలో ఇటీవల ఫేక్ సర్టిఫికెట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొందరు మీ సేవ నిర్వాహకులు అధికారులతో కలిసి ఈ దందాకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఇలాంటి వారు నగర వ్యాప్తంగా ఉన్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.
Fake Certificates | 22,906 ఫేక్ సర్టిఫికెట్లు రద్దు చేసిన జీహెచ్ఎంసీ
నకిలీ సర్టిఫికెట్ల(Fake Certificates) వ్యవహారంపై విచారణ చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. 22,906 ఫేక్ సర్టిఫికెట్లను రద్దు చేశారు. వీటిలో బర్త్ సర్టిఫికెట్లు (Birth certificates) 21,000, డెత్ సర్టిఫికెట్లు (Death certificates) 1,906 ఉన్నాయి. మెహిదీపట్నంలో అత్యధికంగా 5,403 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు ఉండగా, చార్మినార్ సర్కిల్లో 3,256, బేగంపేట్లో 2,123, సికింద్రాబాద్ పరిధిలో 1,511, ఫలక్ నుమా సర్కిల్ పరిధిలో 1,383 ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయి.
Fake Certificates | అధికారులపై వేటు
నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి సహకరించిన అధికారులపైనా జీహెచ్ఎంసీ (GHMC) చర్యలు చేపట్టింది. ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేయడానికి కారణమైన హెల్త్ అసిస్టెంట్లు, కంపూటర్ ఆపరేటర్లు, మెడికల్ ఆఫీసర్లపై వేటు వేసింది. 16 మంది హెల్త్ అసిస్టెంట్లు, 15 మంది కంప్యూటర్ ఆపరేటర్లను విధుల్లో నుంచి తొలగించింది. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లను పేరెంట్ డిపార్ట్మెంట్కు పంపించారు.