More
    HomeజాతీయంKarnataka Deputy CM | కోహ్లీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికిన డిప్యూటీ సీఎం.. యువకులు అద్భుతంగా...

    Karnataka Deputy CM | కోహ్లీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికిన డిప్యూటీ సీఎం.. యువకులు అద్భుతంగా ఆడారంటూ కామెంట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Karnataka Deputy CM | ఈ సాల కప్ నమదే (ఈ ఏడాది కప్ మనదే) అంటూ.. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టు గత రాత్రి పంజాబ్‌పై ఘ‌న విజ‌యం సాధించి ట్రోఫీని కైవ‌సం చేసుకుంది. అహ్మదాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ కింగ్స్‌పై (Punjab Super Kings) అద్భుత విజయం సాధించి, అభిమానుల ఆనందం రెట్టింపు అయ్యేలా చేసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే బెంగళూరు (Bangalore) వీధులు జనసంద్రంగా మారాయి. అభిమానులు జెండాలు ఊపుతూ, బాణాసంచా కాలుస్తూ, నినాదాలతో హోరెత్తించారు.

    Karnataka Deputy CM | డిప్యూటీ సీఎం స్వాగ‌తం..

    అభిమానుల పాటలు, నృత్యాలు, కేరింతలతో రాత్రంతా సందడి వాతావరణం నెలకొంది. చర్చ్ స్ట్రీట్‌లోని పబ్‌లు, కేఫ్‌ల (pubs and cafes) వద్ద వందలాది మంది అభిమానులు గుమిగూడి మ్యాచ్ చివరి క్షణాలను వీక్షించారు. ఆర్సీబీ గెలుపు ఖరారైన వెంటనే, అపరిచితులు సైతం ఆనందంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. యువకులు బాణాసంచా కాల్చగా, “ఈ సాలా కప్ నమదే!” నినాదాలు మిన్నంటాయి. ముఖ్యంగా కోరమంగళ, ఇందిరానగర్ ప్రాంతాల్లో బైక్‌లు, కార్లపై ఆర్సీబీ జెండాలతో (RCB flags) అభిమానులు ప్రదర్శనలు నిర్వహించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా జట్టుకు అండగా నిలిచిన విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరుతో నినాదాలు చేశారు.

    READ ALSO  Vikhroli Bridge | అందుబాటులోకి విఖ్రోలి బ్రిడ్జి.. మూడు లైన్ల‌తో వన్ వేగా..!

    బుధవారం బెంగళూరుకు (Bengaluru) చేరుకున్న విజేత జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. విమానాశ్రయం వెలుపల వేలాదిగా తరలివచ్చిన క్రికెట్ ప్రేమికులు “ఆర్సీబీ! ఆర్సీబీ!” అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) విమానాశ్రయంలో స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. విక్టరీ పరేడ్​లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం ఆర్సీబీ జెండా చేతపట్టుకుని తన వాహనంలో ప్రయాణించడం విశేషం. తాను మ్యాచ్‌ పూర్తిగా చూశానని, ఆర్సీబీ యువకులు అద్భుతంగా ఆడారని అన్నారు. కర్ణాటక ప్రజల తరఫున వారికి తాను అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

    Latest articles

    Kommineni Srinivas Rao | ఇంకెంత కాలం బ‌తుకుతా..ఎంత కాలం ప‌ని చేస్తా.. లైవ్‌లో క‌న్నీళ్లు పెట్టుకున్న కొమ్మినేని

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kommineni Srinivas Rao | అమరావతి(Amaravati) మహిళలపై మురికి వ్యాఖ్యల కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న కొమ్మినేని...

    Minister Seetakka | మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    అక్షరటుడే, ఇందల్వాయి: Minister Seetakka | జిల్లా ఇన్​ఛార్జి మంత్రిగా నియమితులైన సీతక్కను రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి...

    Kajol | రామోజీ ఫిలింసిటీకి జీవితంలో వెళ్ల‌ను.. అదొక భ‌యాన‌క ప్ర‌దేశం : కాజోల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kajol | బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ రామోజీ ఫిలిం సిటీ(Ramoji Film City) గురించి షాకింగ్ కామెంట్స్...

    Collector Ashish Sangwan | ఏడాదిలోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తవ్వాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Collector Ashish Sangwan | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఏడాదిలోగా పూర్తవ్వాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​...

    More like this