అక్షరటుడే, వెబ్‌డెస్క్: TET Exam | తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా డిసెంబర్లో టెట్ పరీక్ష(TET Exam) నిర్వహించారు. మళ్లీ టెట్ కోసం దరఖాస్తులు తీసుకోగా.. తాజాగా పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ(Education Department) విడుదల చేసింది. జూన్ 18 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా రెండు షిఫ్ట్‌ల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు పరీక్షలు జరగనున్నాయి.
TET Exam | రెండు పేపర్లు
టెట్ పరీక్ష పేపర్–1, పేపర్–2 విధానంలో నిర్వహిస్తారు. పేపర్ –1 ఎస్జీటీ అభ్యర్థుల కోసం, పేపర్–2 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థలకు ఉంటుంది. మొత్తం 16 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. జూన్ 18, 19 తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్(Maths), సైన్స్ ఎగ్జామ్స్(Science Exams) నిర్వహిస్తారు. జూన్ 20 నుంచి 23 వరకు పేపర్ 1 పరీక్షలు ఉంటాయి. జూన్ 24న పేపర్ 2తో పాటు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. జూన్ 27న పేపర్ 1 పరీక్ష, జూన్ 28 నుంచి 30 వరకు పేపర్ 2 (సోషల్ స్టడీస్) పరీక్షలు నిర్వహించనున్నారు.
TET Exam | 1,83,653 మంది దరఖాస్తు
ఈ సారి టెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1 కోసం 63,261 మంది, పేపర్-2కు 1,20,392 మంది అప్లై చేశారు. టెట్ ఫలితాలను(TET results) జూలై 22న విడుదల చేయనున్నారు. టెట్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. దీంతో అధికారులు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే హాల్ టికెట్లు విడుదలయ్యే అవకాశం ఉంది.