అక్షరటుడే, కామారెడ్డి:Parttime Lecturers | ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పార్ట్‌టైం అధ్యాపకులకు(Parttime Lecturers) గుర్తింపునివ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ భిక్కనూరు సౌత్ క్యాంపస్(South Campus)లో పార్ట్ టైం ఉద్యోగుల చేస్తున్న నిరసన గురువారం మూడోరోజుకు చేరింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశ్వ విద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీ కోసం ఇచ్చిన జీవో(GO)ను తక్షణమే సవరించి తమకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో పార్ట్ టైం అధ్యాపకుల అధ్యక్షుడు రమేష్, సునీల్ కుమార్, కనకయ్య, శ్రీను కేతావత్, శ్రీకాంత్ గౌడ్, పోతన, శ్రీకాంత్ పాల్గొన్నారు.